కమలా హారిస్‌ అధ్యక్షురాలైతే మూడో ప్రపంచ యుద్ధమే : ట్రంప్‌

If Kamala Harris becomes president, it will be the third world war: Trump

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు, డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ కు మధ్య విమర్శల తూటాలు పేలుతున్నాయి. తాజాగా నార్త్ కరోలినాలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ట్రంప్ ప్రసంగిస్తూ కమలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వచ్చే అధ్యక్ష ఎన్నికల్లో కమలా హారిస్ గెలిస్తే మూడో ప్రపంచ యుద్ధం రావడం ఖాయమని ఆయన చెప్పారు. మీరు జీవితకాలం పొదుపు చేసుకున్న డబ్బు మొత్తం తుడిచిపెట్టుకుపోతుందని అన్నారు. ర్యాడికల్ భావాలు కలిగిన వ్యక్తి కమల అని… ఆమె గెలిస్తే అమెరికాలో మిలియన్ల ఉద్యోగాలు రాత్రికిరాత్రే ఊడిపోతాయని చెప్పారు. తాను అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అమెరికాను చిన్నచూపు చూడనివ్వలేదని అన్నారు. ఈ విషయం ఇతర దేశాధినేతలకు కూడా తెలుసని చెప్పారు.