AP CMOలోకి IASలు రాజమౌళి, కార్తికేయ

Chandrababu wrote a letter to UPSC

సీఎం కార్యాలయంలోకి సీనియర్ ఐఏఎస్లు ఏవీ రాజమౌళి, కార్తికేయ మిశ్రాలను తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఏపీకి చెందిన రాజమౌళి 2015-19 మధ్య సీఎం కార్యదర్శిగా పనిచేశారు. ప్రస్తుతం యూపీ హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నారు. కార్తికేయ కేంద్ర ఆర్థిక శాఖలో డిప్యూటీ సెక్రటరీగా పనిచేస్తున్నారు.

వీరిద్దరిని డిప్యుటేషన్పై ఏపీకి పంపాలని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువుదీరింది. ముఖ్యమంత్రి గా చంద్రబాబు బాధ్యతలు చేపట్టడమే కాదు మంత్రులకు పలు శాఖలు కేటాయించడం జరిగింది. అలాగే అనేక శాఖల్లో అధికారుల ఫై వేటు వేయడం..కొత్త వారిని ఎంపిక చేయడం చేస్తున్నారు. టీటీడీ ఈవోగా జె.శ్యామలరావును నియామిస్తు ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఇదివరకు ఈవోగా ఉన్న ధర్మారెడ్డిని రాష్ట్ర ప్రభుత్వం తొలగించింది. ఇప్పటికే ధర్మారెడ్డికి ఏడు రోజుల సాధారణ సెలవును మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (CS) నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు ఇది వరకే ఇచ్చారు.