Muralidhar Goud: ఎంతో పేదరికాన్నీ అనుభవించా :బలగం మురళీధర్

Muralidhar Goud: ఎంతో పేదరికాన్నీ అనుభవించా :బలగం మురళీధర్

‘బలగం’, ‘డీజే టిల్లు’ సినిమాలతో మరింత పాపులర్ అయిన నటుడు మురళీధర్ గౌడ్. ఆయన తాజాగా ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాలో వెంకటేశ్ మామ పాత్రతో ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. తాజాగా ‘బిగ్ టీవీ’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన సినీ ప్రస్థానం, వ్యక్తిగత జీవితంతో పాటు తన లక్ష్యాల గురించి ప్రస్తావించారు.

Advertisements

సినిమా ఇండస్ట్రీ

“నేను ఉద్యోగం చేస్తున్నప్పుడే నటనపై ఆసక్తితో టీవీ సీరియల్స్‌లో చిన్నచిన్న పాత్రలు పోషించాను. అయితే, రిటైర్మెంట్ తర్వాత నాకు పెద్ద పాత్రలు వస్తాయని అనుకున్నాను. కానీ సినీ ఇండస్ట్రీలో అవకాశం దొరకడం అంత తేలికకాదని అప్పుడు అర్థమైంది” అని మురళీధర్ గౌడ్ అన్నారు.అనేక అడ్డంకులు ఎదురైనా సినీ ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలనే పట్టుదలతో అనేక సినిమాల ఆఫీసుల చుట్టూ తిరిగిన విషయాన్ని గుర్తుచేసుకున్నారు.’డీజే టిల్లు’ సినిమా నాకెంతో కీలకం. ఈ సినిమా తర్వాతే నా ప్రయాణం మలుపు తిరిగింది. నన్ను ఓ మంచి నటుడిగా ప్రేక్షకులు గుర్తించడానికి కారణమైంది” అని అన్నారు.

కోటీశ్వరుడిగా మారాలన్న సంకల్పం

మురళీధర్ గౌడ్ తన వ్యక్తిగత జీవితాన్ని గురించి కూడా ఈ ఇంటర్వ్యూలో ప్రస్తావించారు. “మా కుటుంబం చాలా పేదది. ఐదుగురు పిల్లలు ఉండటంతో మా నాన్న ఒక్కడే కష్టపడి మా కుటుంబాన్ని పోషించేవారు. చిన్నప్పటి నుంచి పేదరికాన్ని చూశాను. అప్పు చేసి బ్రతకడం నాకు ఇష్టం ఉండదు , ఎవరి సహాయాన్ని ఆశించకుండా ఎదగాలని నిర్ణయించుకున్నాను” అని చెప్పారు.అయితే, తన జీవితంలో ఒక పెద్ద లక్ష్యం ఉందని మురళీధర్ గౌడ్ తెలిపారు. “సాదాసీదాగా ఉండటానికే ఇష్టపడతాను. కానీ కోటీశ్వరుడిని కావాలనే పట్టుదల నాలో పెరుగుతూ వచ్చింది.అందుకు కారణం ఊహ తెలిసిన దగ్గర నుంచి నేను అనుభవిస్తూ వచ్చిన పేదరికమే.ఆ కసితోనే కోటీశ్వరుడిని కావాలనుకుంటున్నాను” అని చెప్పారు.

Copy of Profile1 6

పూర్తిగా ఫోకస్

“ఏ పని చేయాలనుకున్నా, దానిపై పూర్తిగా ఫోకస్ పెట్టడం నా అలవాటు. అదే నన్ను ఇంతదూరం తీసుకొచ్చింది” అని మురళీధర్ గౌడ్ తన జీవిత సూత్రాన్ని వివరిస్తూ చెప్పారు. “నాకు అవకాశాల కోసం ఎదురుచూడటం ఎప్పుడూ నచ్చలేదు. నాపై నాకే నమ్మకం ఉంది. కష్టపడితే ఏదైనా సాధ్యమే” అని చెప్పారు.

ప్రేక్షకులకు కృతజ్ఞతలు

తనను ఆదరిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు, ముందుగా మరిన్ని విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలిపారు. “ప్రతి సినిమాతో కొత్తగా కనిపించాలని అనుకుంటాను. నా కెరీర్‌ను మరో మెట్టుపైకి తీసుకెళ్లడానికి కృషి చేస్తాను” అని చెప్పారు.ఈ ఇంటర్వ్యూ ద్వారా మురళీధర్ గౌడ్ తన విజయ పథాన్ని, ఎదురుకున్న కష్టాలను, భవిష్యత్తు లక్ష్యాలను పంచుకున్నారు. సినీ ఇండస్ట్రీలో తన కృషితో ఎదిగిన ఆయనకు మరిన్ని విజయాలు రావాలని సినీ ప్రియులు ఆకాంక్షిస్తున్నారు.

Related Posts
పుష్ప-2 లో మరికొన్ని సీన్లు
Srivallipushparaj

అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమాకు పాన్ ఇండియా రేంజ్‌లో భారీ విజయాన్ని సాధించి, ప్రేక్షకులకు స్పెషల్ సర్‌ప్రైజ్ ఇవ్వనున్నట్లు సమాచారం. డిసెంబర్ 5న విడుదలైన Read more

‘NBK109’ విడుదలపై లేటెస్ట్ బజ్
nbk109 1709905586

టాలీవుడ్ హీరో నందమూరి బాలకృష్ణ తాజాగా ప్రముఖ దర్శకుడు బాబీ (కె.ఎస్. రవీంద్ర) దర్శకత్వంలో ఒక మాస్ ఎంటర్‌టైనర్ చిత్రంలో నటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే ప్రస్తుతం Read more

లైఫ్ పార్ట్‌నర్‌పై రష్మిక కామెంట్స్‌..
rashmika mandanna

తన జీవితానికి సంబంధించి ప్రేమ, గౌరవం, భాగస్వామ్యం గురించి రష్మిక మందన్న తాజాగా చేసిన వ్యాఖ్యలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. జీవితంలో ఎదురయ్యే కష్టాల సమయంలో ఒకరిపై ఒకరికి Read more

7G RAINBOW COLONY 2: ‘7/జీ బృందావన్​ కాలని’ సీక్వెల్ అప్డేట్
7G RAINBOW COLONY 2: '7/జీ బృందావన్​ కాలని' సీక్వెల్ అప్డేట్

'7జీ బృందావన్ కాలనీ 2' తో రీటర్న్ అవుతున్న హార్ట్‌టచింగ్ లవ్ స్టోరీ 2004లో విడుదలై యూత్‌ను హత్తుకున్న ఒక ప్రత్యేకమైన సినిమా.. అదే 7/జీ బృందావన్ Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×