తనకు బాలీవుడ్ అనే పదం నచ్చదని, హిందీ సినిమా అని పిలవడమే ఇష్టమని పుష్ప-2 థాంక్స్ మీట్లో అల్లు అర్జున్ అన్నారు. అల్లు అర్జున్ – సుకుమార్ కలయికలో వచ్చిన పుష్ప 2 ఎంతటి విజయాన్ని సాధించిందో తెలియదు కాదు. కానీ ఈ మూవీ ప్రీమియర్ షో సందర్బంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట..అల్లు అర్జున్ ను ఈ సినిమా సక్సెస్ ను పూర్తి స్థాయి లో ఎంజాయ్ చేయకుండా చేసింది. కానీ చిత్ర యూనిట్ కోసం..శనివారం సక్సెస్ మీట్ ను రహస్యంగా జరిపారు. కొద్దీ మంది మీడియా వారికీ , చిత్ర యూనిట్ కు మాత్రమే ఆహ్వానం అందించి సక్సెస్ మీట్ జరిపారు.

ఈ సందర్బంగా అల్లు అర్జున్ బాలీవుడ్ అనే పదం పై స్పందించారు. తనకు బాలీవుడ్ అనే పదం నచ్చదని, హిందీ సినిమా అని పిలవడమే ఇష్టమని పుష్ప-2 థాంక్స్ మీట్లో అల్లు అర్జున్ అన్నారు. ఆయన ఈ వ్యాఖ్యలు చేయగానే నిర్మాత రవిశంకర్ అప్రమత్తమయ్యారు. ‘బాలీవుడ్’ వ్యాఖ్యలపై స్పష్టత ఇవ్వాలని బన్నీకి చెవిలో చెప్పారు. దీంతో ఆయన తనకు ఆ పదం మాత్రమే నచ్చదని స్పష్టం చేశారు. పుష్ప-2 కోసం ఓ హిందీ సినిమా రిలీజ్ను వాయిదా వేశారని, ఆ మూవీ టీమ్కి కాల్ చేసి కృతజ్ఞతలు చెప్పానన్నారు.
ఇక డైరెక్టర్ సుకుమార్ మాట్లాడుతూ…’పుష్ప-2’లో అల్లు అర్జున్ నటన ఎస్వీ రంగారావును గుర్తుకు తెచ్చిందని ఇద్దరు వ్యక్తులు తనతో చెప్పినట్లు సుకుమార్ తెలిపారు. దీనిని మరోలా తీసుకోవద్దని, ట్రోల్స్ చేయవద్దని ప్రేక్షకులను కోరారు. ‘అల్లు అర్జున్ ఎస్వీ రంగారావులా నటించాడని ఒకాయన అంటే SVR డాన్సులు, ఫైట్లు చేయడు కదా అని పక్కనున్న మరో వ్యక్తి అన్నారు. అంటే బన్నీ ఓ పరిపూర్ణమైన హీరో’ అని థాంక్స్ మీట్లో మాట్లాడారు.