hydra

శంషాబాద్‌లో అక్రమ హోర్డింగ్‌లను తొలగించిన హైడ్రా

రంగారెడ్డి జిల్లా, శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో హైడ్రా అధికారులు అక్రమ హోర్డింగులను తొలగించారు. బెంగళూరు జాతీయ రహదారికి ఇరువైపులా అనుమతులు లేకుండా ఏర్పాటు చేసిన హోర్డింగులను మున్సిపల్ అధికారులతో కలిసి హైడ్రా తొలగించింది. శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో సుమారు 17 హోర్డింగ్‌లను అనుమతి లేకుండా ఏర్పాటు చేసినట్లు అధికారులు గుర్తించారు. మున్సిపల్ అధికారులు ఫిర్యాదు చేయడంతో హైడ్రా రంగంలోకి దిగి వాటిని తొలగించింది. అక్రమ హోర్డింగ్‌లపై చర్యలు కొనసాగుతాయని హైడ్రా అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా, నిర్మాణ రంగ వ్యర్థాలు, ఇతర వ్యర్థాలను అక్రమంగా డంప్ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని హైడ్రా నిర్ణయించింది. చెరువులు, నాలాలు, ఖాళీ స్థలాల్లో వ్యర్థాలు పోసే వాహనాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసింది. అక్రమంగా వ్యర్థాలు డంప్ చేస్తున్న నాలుగు టిప్పర్లను హైడ్రా డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ బృందాలు సీజ్ చేశాయి.

Related Posts
Mobile Phones: తెలంగాణలో మొబైల్ ఫోన్ల విస్ఫోటనం – జనాభా కంటే అధికం!
తెలంగాణలో మొబైల్ ఫోన్ల విస్ఫోటనం – జనాభా కంటే అధికం!

తెలంగాణ‌లో రోజురోజుకూ మొబైల్ ఫోన్ల వినియోగం పెరుగుతోంది. ప్ర‌స్తుతం రాష్ట్రంలో జ‌నాభా కంటే మొబైల్ ఫోన్లు అధికంగా ఉన్నాయి. టెలికాం రెగ్యులేట‌రీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్‌) Read more

కౌశిక్ రెడ్డిపై 3 కేసులు నమోదు
sanjya koushik

జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై మూడు కేసులు నమోదయ్యాయి. అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష నిర్వహిస్తున్న సమయంలో జరిగిన ఘటన నేపథ్యంగా ఆర్డీవో, గ్రంథాలయ ఛైర్మన్, ఎమ్మెల్యే Read more

డిప్రెషన్‌తో కేపీ చౌదరి ఆత్మహత్య : పోలీసులు
KP Chowdary

తెలుగు సినీ నిర్మాత కెపి చౌదరి తన సూసైడ్ నోట్‌లో డిప్రెషన్ కారణంగానే తాను ఈ విపరీతమైన చర్య తీసుకున్నానని, తన మరణానికి ఎవరూ బాధ్యులు కాకూడదని Read more

హైడ్రాలో డీఆర్ఎఫ్ పాత్ర చాలా కీలకం: రంగనాథ్
DRF role in HYDRA is crucial.. Ranganath

హైదరాబాద్‌: హైడ్రా నిర్వ‌హిస్తున్న విధుల‌న్నిటిలో డీఆర్ఎఫ్ బృందాల పాత్ర చాలా కీల‌క‌మైన‌ద‌ని హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్‌ అన్నారు. ప్ర‌భుత్వ ల‌క్ష్యాలు, ప్ర‌జ‌ల అంచ‌నాల మేర‌కు హైడ్రా Read more