హైదరాబాద్లో మరోసారి ‘హైడ్రా’ కూల్చివేతలు

హైదరాబాద్ రాంనగర్ లోని మణెమ్మ బస్తీలో ‘హైడ్రా’ అధికారులు అక్రమ నిర్మాణాలను కూల్చేస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో చెరువులు, కుంటలు, ప్రభుత్వ స్థలాల ఆక్రమణలపై ‘హైడ్రా’ ఉక్కుపాదం మోపుతున్న సంగతి తెలిసిందే. చెరువులు, ప్రభుత్వ స్థలాలు కబ్జా జరిగిందనే ఫిర్యాదు అందితే చాలు సీన్‌లోకి హైడ్రా ఎంట్రీ ఇచ్చేస్తోంది. ప్రభుత్వం కల్పించిన విస్తృత అధికారాలతో అక్రమ నిర్మాణాలపై బుల్డోజర్లతో విరుచుకుపడుతోంది. ఇప్పటికే పదుల సంఖ్యలో అక్రమ నిర్మాణాలు కూల్చేసిన హైడ్రా..వందల ఇళ్లకు నోటీసులు అందించారు.

ఈ క్రమంలో హైదరాబాద్ రాంనగర్ లోని మణెమ్మ బస్తీలో అక్రమ నిర్మాణాలు చేపట్టారని పిర్యాదు తో ‘హైడ్రా’ బుల్డోజర్లు అడుగుపెట్టాయి. నాలాను ఆక్రమించి నిర్మించిన కట్టడాలను అధికారులు కూల్చేస్తున్నారు. రెండు రోజుల క్రితం ఈ ప్రాంతాన్ని హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు. ఆక్రమణలపై నివేదిక సమర్పించాలని GHMC రెవెన్యూ అధికారులను ఆదేశించారు. అక్రమ కట్టడాలని తేలడంతో ఈరోజు ఉదయం కూల్చివేతలు మొదలయ్యాయి.