హైడ్రా కు ప్రభుత్వం మరింత ప్రోత్సాహం

హైదరాబాద్ లో హైడ్రా పేరు వణుకు పుట్టిస్తుంది. చెరువులు , ప్రభుత్వ సంస్థలు కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టిన వారికీ నిద్ర లేకుండా చేస్తుంది. అక్రమ నిర్మాణం చేపట్టిన వాటిని కూల్చేయాలని ప్రభుత్వం హైడ్రా కు ఆదేశాలు జారీ చేయడం తో..హైడ్రా ఎక్కడ తగ్గడం లేదు. రాజకీయ నేతలు , సినీ ప్రముఖులు , బిజినెస్ రంగ ప్రముఖులు ఇలా ఎవర్ని వదిలిపెట్టడం లేదు. హైడ్రా కు పిర్యాదు వస్తే చాలు విచారణ చేపట్టడం..నిజమే అని తేలితే కూల్చేస్తుంది. ఇప్పటికే నగరంలో ఎన్ని అక్రమ నిర్మాణాలు కూల్చిన హైడ్రా కు ప్రభుత్వం మరింత ప్రోత్సాహం కల్పించింది.

ఇప్పటివరకూ జలమండలి పరిధిలోని గండిపేట, హిమాయత్ సాగర్ చెరువుల పరిరక్షణను ఇకపై హైడ్రా పరిధిలోకి తీసుకురాబోతున్నారు. అలాగే ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలోని అన్ని చెరువులు, పేరుకులు, నాలాలు, ప్రభుత్వ స్థలాలను రక్షించే బాధ్యతలూ హైడ్రాకే అప్పగించబోతున్నారు. ఇందుకోసం ఇప్పటికే ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. ఎక్కడైనా ఆక్రమణలు జరిగితే నోటీసులు ఇవ్వడం దగ్గర నుంచి అవసరమైతే కూల్చివేసే వరకూ కూడా అన్ని నిర్ణయాలూ హైడ్రా కనుసన్నల్లోనే జరిగేలా విధానాలను రూపొందిస్తోంది ప్రభుత్వం. పూర్తి అధికారాలు హైడ్రా కు అప్పగించడం ద్వారా భవిష్యత్ లో కోర్టు చిక్కులు.. ఇబ్బందులు ఎదురుకాకుండా ఉంటాయని ప్రభుత్వం భావిస్తోంది.

ఈమేరకు హైడ్రాకు ఫుల్ పవర్స్ కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నట్టు చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి సెక్రటేరియట్ లో వెల్లడించారు. హైడ్రాపై గురువారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఇప్పటివరకూ ఆక్రమణలపై నోటీసులు ఇస్తున్న విధానాన్ని మార్చాలని నిర్ణయించారు. ఇప్పటివరకూ ఇటువంటి ఆక్రమణలపై వివిధ విభాగాలు అంటే పంచాయతీరాజ్, జలమండలి, జీహెచ్ఎంసి వంటివి విడివిడిగా నోటీసులు ఇస్తూ వస్తున్నాయి. ఇప్పటి నుంచి అలా కాకుండా హైడ్రా ఆధ్వర్యంలోనే నోటీసులను జరీ చేసేలా చర్యలు తీసుకోవాలని దీనికోసం విధి విధానాలు రూపొంచాలని శాంతి కుమారి మున్సిపల్ శాఖ చీఫ్ సెక్రటరీని ఆదేశించారు.