రేపు హైదరాబాద్ లో 144 సెక్షన్

రేపు తెలంగాణ ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో హైదరాబాద్ లో 144 సెక్షన్ విధించారు. ఆదివారం ఉదయం 6 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకూ ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని గ్రేటర్ పరిధిలోని మూడు కమిషనరేట్ల సీపీలు సందీప్ శాండిల్య, స్టీఫెన్ రవీంద్ర, డీఎస్ చౌహాన్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.

కౌంటింగ్ సెంటర్లు, బహిరంగ ప్రదేశాల్లో ఆంక్షలు అమల్లో ఉంటాయని పేర్కొన్నారు. ఐదుగురి కంటే ఎక్కవ మంది గుమిగూడొద్దని, వీధుల్లో బాణసంచా కాల్చొద్దని సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. అలాగే మద్యం షాప్స్ కూడా బంద్ చేయాలనీ ఆదేశాలు జారీ చేసారు.