మరో మహిళతో భర్త.. రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్న భార్య

ఇటీవల అక్రమ సంబంధాలు రోజు రోజుకు ఎక్కువైపోతున్నాయి. ఇంట్లో భార్య , భర్త ఉండగానే మరొకరితో అక్రమ సంబంధాలు ఏర్పరుచుకుంటున్నారు. ఈ అక్రమ సంబంధాల కారణంగా హత్యలు పెరిగిపోతున్నాయి..దీంతో అభం శుభం తెలియని చిన్నారులు రోడ్డున పడుతున్నారు. తాజాగా విశాఖ సిటీ..భార్య ఉండగానే మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్న భర్త ను రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్న భార్య తన కోపాన్ని తీర్చుకుంది.

విశాఖ సిటీకి చెందిన వివేక్‌ కొన్నాళ్ల కిందట హరిత అనే యువతిని ప్రేమించాడు. పెద్దల సమక్షంలో ఆమెని పెళ్లి చేసుకున్నాడు. కొన్నాళ్లుపాటు వీరి కాపురం సజావుగా సాగింది. ఆ తర్వాత వివేక్ తన అందాన్ని రెట్టింపు చేసుకునేందుకు స్పా కు వెళ్లడం మొదలు పెట్టాడు. అక్కడ ఓ యువతితో వివేక్‌కు పరిచయం ఏర్పడింది. యువతి సీతమ్మధారలో ఉంటోంది. పరిచయం కాస్తా ఫ్రెండ్‌ షిప్‌గా మారింది. ఆమె మీద మోజుతో విలువైన వస్తువులు బహుమతులు ఇస్తూ వచ్చాడు. ఇద్దరూ చెట్టాపట్టాలేసుకొని పార్కులు, బీచ్‌లు, హోటల్స్‌లో ఎంజాయ్ చేశారు. ఆ తర్వాత వారి మధ్య శారీరకంగా సంబధం మొదలైంది. దీంతో ఇంటికి రాకపోయేసరికి వివేక్ వ్యవహార శైలిని గమనించింది భార్య హరిత..వివేక్ పని చేస్తున్న ప్రాంతానికి వెళ్లి వాకబు చేసింది. ఆ తర్వాత భర్త ఎక్కడకు వెళ్తున్నాడు? ఎవరితో సమావేశం అవుతున్నాడు అనేదానిపై ఓ కన్నేసింది.

గురువారం ఉదయం ప్రియురాలితో బెడ్‌రూమ్‌లో ఉన్నాడు వివేక్. ఈ రూమ్‌కి ఎవరు రారని భావించి వాళ్ల పనుల్లో వారు నిమగ్నమయ్యారు. వివేక్ రూమ్‌కి వెళ్లిన పావుగంటకు భార్య హరిత, ఆమె బంధువులు అక్కడి కి చేరుకున్నారు. వారిద్దరినీ బెడ్ మీద చూసి షాకయ్యారు. బంధువుల సాయంతో హరిత, ప్రియురాలిని కుమ్మేసింది. అటు భర్తను కూడా వదల్లేదు. ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకొచ్చింది భార్య హరిత. తన న్యాయం చేయాలని పోలీసులను కోరింది. వారికి పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చారు.