Huge arms dump found in Coombings

కూంబింగుల్లో బయటపడిన భారీ ఆయుధాల డంప్‌

రాయ్‌పూర్‌: ఇటీవల భద్రతా బలగాల ఆపరేషన్లు, ఎన్‌కౌంటర్లతో మావోయిస్టులకు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. వరుస ఎదురుకాల్పుల్లో భారీగా క్యాడర్‌ను కోల్పోతున్న మావోయిస్టులు.. మరోపక్క పోలీసుల కూంబింగుల్లో ఆయుధ డంప్‌లను కనుగొంటున్నారు. గత శనివారం ఛత్తీస్‌గఢ్‌లోని మల్కన్‌గిరి జిల్లాలో ఆయుధ డంప్‌ బయటపడిన విషయం తెలిసిందే. తాజాగా సుక్మా జిల్లాలో కూడా మరో డంప్‌ను భద్రతా బలగాలు కనుగొన్నాయి. జిల్లాలోని దుల్లేడ్‌, మెట్టుగూడ అటవీ ప్రాంతంలో 203 కోబ్రా బెటాలియన్‌, సీఆర్పీఎఫ్‌ 131 బెటాలియన్‌ సిబ్బంది కూంబింగ్‌ చేపట్టాయి.

image

ఈ క్రమంలో మెట్టుగూడ గ్రామం నుంచి 1.5 కిలోమీటర్ల దూరంలో ఒక గుహను కనుపెట్టారు. అందులో పరిశీలించగా 21 ఐఈడీలు, మల్టీ బ్యారెల్‌ గ్రెనేడ్‌ లాంచర్‌ (BGL), ఒక జనరేటర్‌ సెట్‌, లాత్‌ మెషిన్‌ పరికరాలు, భారీ మొత్తంలో పేలుడు తయారీ పదార్థాలు, తుపాకీ తయారీ పరికరాలు, వైద్య సామాగ్రి ఉన్నాయి. భద్రతా బలగాలు భారీ ఆయుధ డంప్‌ను స్వాధీనం చేసుకోవడంతో మావోయిస్టులకు పెద్ద ఎదురుదెబ్బ తగినట్లయింది.

ఛత్తీస్‌గఢ్‌-ఒడిశా సరిహద్దుల్లో మంగళవారం కేంద్ర, రాష్ట్ర పోలీసు బలగాలు జరిపిన సంయుక్త ఆపరేషన్‌లో చనిపోయిన 16 మంది మావోయిస్టులు చనిపోయిన విషయం తెలిసిందే. వారిలో దశాబ్దాల పాటు భద్రతా దళాలకు దొరకకుండా తప్పించుకు తిరుగుతున్న మావోయిస్టు అగ్రనేత జయరాం రెడ్డి అలియాస్‌ చలపతి కూడా ఉన్నారు.

Related Posts
ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
Fatal road accident. Six killed

డెహ్రాడూన్‌ : ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని డెహ్రాడూన్‌లో ఈరోజు (మంగళవారం) తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. దీంతో ఆరుగురు అక్కడిక్కడే మృతి చెందారు. అలాగే మరో వ్యక్తికి Read more

‘ఆర్గానిక్ క్రీమరీ బై ఐస్‌బర్గ్’ ప్రారంభం
Organic Creamery by Iceberg

'Organic Creamery by Iceberg' హైదరాబాద్‌: భారతదేశపు మొట్టమొదటి ఆర్గానిక్ ఐస్ క్రీం బ్రాండ్ అయిన ఐస్‌బర్గ్ విస్తరణ దిశలో ఉంది. ప్రీమియం బ్రాండ్ 'ఆర్గానిక్ క్రీమరీ Read more

హైదరాబాద్ కు చేరుకున్న సీఎం రేవంత్
Telangana CM Revanth returns to Hyderabad from Davos

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనను విజయవంతంగా ముగించుకుని హైదరాబాద్ చేరుకున్నారు. ఈ సందర్బంగా కాంగ్రెస్ శ్రేణులు శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ వద్ద ఆయనకు ఘనంగా స్వాగతం Read more

తెలంగాణలో రేవంత్‌ రెడ్డి రాజ్యాంగమే నడుస్తుంది: కేటీఆర్‌..!
ktr comments on cm revanth reddy

హైదరాబాద్‌: బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఏసీబీ ప్రధాన కార్యాలయం వద్ద తన న్యాయవాదిని పోలీసులు అడ్డుకోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. చట్టాన్ని గౌరవించే సాధారణ పౌరుడి Read more