శ్రీవారి దర్శనానికి ఎంత సమయం పడుతుందంటే..!!

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. కంపార్టుమెంట్లన్నీ నిండి టీబీసీ వరకు క్యూలైన్లో భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 67,223 మంది భక్తులు దర్శించుకున్నారు. 24,549 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. అదే సమయంలో శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.66 కోట్లు సమకూరింది.

ఇదిలా ఉంటె శ్రీవారి దర్శనానికి రద్దీని నియంత్రిచేందకు, దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు త్వరగా దర్శన భాగ్యం కల్పించేందుకు టీటీడీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. జులై 22 నుంచి శ్రీవాణి దర్శన టికెట్ల రోజు వారి కోటాను కేవలం వెయ్యి టికెట్లను మాత్రమే ఇవ్వనున్నారు. అయితే, ఆన్‌లైన్‌లో టికెట్ల విషయంలో ఎలాంటి మార్పుల చేయకుండా 500, ఆఫ్‌లైన్‌లో వెయ్యి టికెట్లు మాత్రమే జారీ చేయనున్నారు. ఇందు భాగంగా గోకులం విశ్రాంతి భవనంలో 900 శ్రీవాణి టికెట్లు, మరో 100 టికెట్లను దాతలకు ఎయిర్‌పోర్టు బుకింగ్‌ కౌంటర్‌లలో అందుబాటులో ఉంటాయి.