తెలంగాణ లో భారీ వర్షాలకు ఎంత మంది నష్టపోయారంటే..?

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడన ప్రభావంతో గత రెండు మూడు రోజుల పాటు కురిసిన వర్షాలకు జనజీవనం స్తంభించిపోయింది. పలు చోట్లు వాగులు, కట్టలు తెగి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. 24 గంటల పాటు కురిసిన కుండపోత వర్షాలకు ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాలో వరదలు ముచ్చేత్తాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా 67 వేల మంది నష్టపోయినట్లు సమాచారం. మొత్తం 117 గ్రామాల్లో ఈ నష్టం వాటిల్లింది. బాధితుల్లో ఖమ్మం జిల్లాలోనే 49వేల మంది ఉన్నట్లు మంత్రి పొంగులేటి తెలిపారు. ప్రాథమిక అంచనా ప్రకారం 44 ఇళ్లు పూర్తిగా మరో 600 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. 51 వంతెనలు, 249 కల్వర్టులు, 166 చెరువులు ధ్వంసమైనట్లు తెలుస్తోంది. 13,342 జీవాలు మృతి చెందాయని పేర్కొన్నారు.