ఇరాన్‌పై అమెరికా (America against Iran) మెరుపుదాడి చేసింది. మూడు అణు స్థావరాలు నేలమట్టమయ్యాయి. ఈ మిషన్ పేరు “ఆపరేషన్ మిడ్‌నైట్ హామర్”(Operation Midnight Hammer). ఫార్దో, నతాంజ్, ఇస్పహాన్ అణు కేంద్రాలే లక్ష్యంగా బాంబులు వర్షించాయి.ఈ దాడికి ముందు ప్లాన్ భారీగా జరిగింది. అమెరికా ప్రకారం, ఇది చరిత్రలోని అత్యంత రహస్య మిషన్‌లలో ఒకటి. ఇరాన్ దృష్టి మరల్చేందుకు కొన్ని విమానాలు పసిఫిక్ దిశగా వెళ్లించాయి. అసలు లక్ష్యం ఎవరికీ తెలియకుండా గోప్యంగా దాడి చేశారు.

B-2 బాంబర్ల సాహసయాత్ర
ఈ దాడిలో అమెరికా 7 B-2 స్టెల్త్ బాంబర్లు ఉపయోగించింది. ఒక్కో బాంబర్‌లో ఇద్దరు మాత్రమే సిబ్బంది ఉన్నారు. ఇవి 18 గంటల పాటు ప్రయాణించాయి. మిడ్వేలో గాల్లోనే ఇంధనం నింపుకుని, లఘువేగంగా లక్ష్యాన్ని చేరుకున్నాయి.

బంకర్ బస్టర్ బాంబులే కీలకం
మొత్తం 14 బంకర్-బస్టర్ బాంబులు ఉపయోగించారు. ఇవి కఠినమైన భద్రత కలిగిన అణు స్థావరాలను కూడా ఛేదించగలవు. ఓ వైపు జలాంతర్గాముల నుంచి ప్రయోగించిన క్రూయిజ్ క్షిపణులు కూడా తమ పని తీర్చాయి.

గాలి లోనే కలిసిపోయిన యుద్ధవిమానాలు
ఈ మిషన్‌లో మరో అద్భుతం – గాల్లోనే వివిధ యుద్ధవిమానాలు ఒకదానితో ఒకటి లింక్ అయ్యాయి. తక్కువ ఎయిర్ స్పేస్‌లో, ఖచ్చితమైన టైమింగ్‌తో ఈ పని జరిగినట్లు పెంటగాన్ వెల్లడించింది.

అమెరికా నైపుణ్యానికి ప్రపంచం మెచ్చాలి
జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ చైర్మన్ డాన్ కెయిన్ ప్రకారం, ఇది అమెరికా దళాల నైపుణ్యానికి నిదర్శనం. సుదీర్ఘ ప్రణాళిక, సమన్వయం, సాంకేతిక విజయం అన్నీ ఈ మిషన్‌లో ప్రతిఫలించాయి.
Read Also : China : ఇరాన్‌పై అమెరికా దాడి : తప్పుబట్టిన చైనా