Trump

ఇరాన్ అణ్వాయుధ ప్లాంట్ లను ధ్వంసం చేయండి : ఇజ్రాయెల్ కు ట్రంప్ సూచన

వాషింగ్టన్: ఇజ్రాయెల్‌పై ఇరాన్‌ ప్రత్యక్ష దాడితో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చాయి. ఇరు దేశాలు పరస్పరం మిస్సైళ్లు, బాంబుల వర్షం కురిపించుకుంటున్నాయి. దీంతో పశ్చిమాసియాపై యుద్ధ మేఘాలు అలముకున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్‌ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌ అణుస్థావరాలను ఇజ్రాయెల్‌ ధ్వంసం చేస్తుందని తాను భావిస్తున్నట్లు తెలిపారు. నార్త్‌ కరోలినాలో జరిగిన అధ్యక్ష ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ట్రంప్‌ మాట్లాడుతూ.. ఈ విధంగా వ్యాఖ్యానించారు.

ఇరాన్‌ అణు కేంద్రాలను ఇజ్రాయెల్‌ లక్ష్యంగా చేసుకుందనే అంశంపై ఇటీవలే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ను ఓ విలేకరి ప్రశ్నించగా.. ఆయన స్పందించలేదు. ఈ క్రమంలో బైడెన్‌ వైఖరిని ట్రంప్‌ తీవ్రంగా తప్పుబట్టారు. ప్రతీకార దాడులను ఇరాన్ అణ్వాయుధ కేంద్రాలతో మొదలు పెట్టాలని ఇజ్రాయెల్‌కు ట్రంప్ సూచించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రపంచం మొత్తానికి అణ్వాయుధాలతోనే పెను ముప్పు పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే ముందుగా ఇరాన్‌ అణు కేంద్రాలను ధ్వంసం చేయాలన్నారు. ఆ తర్వాత మిగతా టార్గెట్లపై ఆలోచించొచ్చన్నారు.

Related Posts
ఆరోగ్యశ్రీ, ఫీ రీయింబర్స్మెంట్పై బండి సంజయ్ డిమాండ్
ఆరోగ్యశ్రీ, ఫీ రీయింబర్స్మెంట్ పై బండి సంజయ్ డిమాండ్

ఆరోగ్యశ్రీ మొత్తాన్ని చెల్లించకపోవడం వలన, పేదలు, నిరుపేదలకు నెట్వర్క్ ఆసుపత్రుల నుండి ఆరోగ్య సేవలు అందట్లేదని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆగ్రహం Read more

మన్మోహన్ సింగ్ స్మారక స్థలం ఎక్కడ?
మన్మోహన్ సింగ్ స్మారక స్థలం ఎక్కడ?

కేంద్రం, మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ స్మారకాన్ని నిర్మించడానికి సంబంధించి ప్రతిపాదిత స్థలాలను, ఎంపికలను ఆయన కుటుంబ సభ్యులకు పంపాలని సూచించింది. రాజ్‌ఘాట్, రాష్ట్రీయ స్మృతి Read more

బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేపై యూత్ కాంగ్రెస్ దాడి
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేపై యూత్ కాంగ్రెస్ దాడి

చోపడండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంపై బీఆర్ఎస్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా గురువారం గంగాధార మండలం బురుగుపల్లిలోని ఆయన ఇంటిపై యూత్ Read more

భారతదేశం-నైజీరియా సంబంధాలు: పీఎం మోదీ సందర్శన ద్వారా కొత్త మార్గాలు..
images 2

భారత ప్రధాని నరేంద్ర మోదీ నైజీరియాకు చేసిన సందర్శన, ప్రపంచంలోనే అత్యంత ప్రజాస్వామ్యంగా ఉన్న దేశం (భారతదేశం) మరియు ఆఫ్రికాలో అతిపెద్ద దేశం (నైజీరియా) మధ్య సహకారాన్ని Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *