పదో తరగతి హిందీ ప్రశ్న పత్రం లీక్ వెనుక ప్ర‌తిప‌క్ష పార్టీ నేత పాత్ర ..

పదో తరగతి హిందీ ప్రశ్న పత్రం లీక్ వెనుక ప్రతిపక్ష పార్టీ నేత పాత్ర ఉందని తేల్చిన పోలీసులు తేల్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) ప్రశ్నపత్రాల లీకేజీ కేసు సంచలనంగా మారింది. లీకేజీ కేసులో సిట్‌ విచారణ కొనసాగుతోంది. ఇప్పటివరకు ప్రశ్నపత్రం లీక్‌ చేసిన ప్రవీణ్‌, రాజశేఖర్‌, పరీక్షలు రాసిన వారు సహా మొత్తం 15 మందిని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఓవైపు టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ విచారణ జరుగుతుండగానే.. పదో తరగతి పేపర్లు లీక్ కావడం ప్రభుత్వాన్ని మరింత విమర్శలపాలు చేస్తుంది. నిన్న తెలుగు పేపర్ లీక్ కాగా..ఈరోజు హిందీ పేపర్ లీక్ అయ్యింది.

ఈ పేపర్ లీక్ వెనుక ప్ర‌తిప‌క్ష పార్టీ నేత పాత్ర ఉందని పోలీసులు నిర్దారించారు. ప‌రీక్ష ప్రారంభ‌మైన 77 నిమిషాల‌కు ప్ర‌శ్నప‌త్రం వాట్సాప్ ద్వారా బ‌య‌ట‌కు వ‌చ్చిన‌ట్లు పోలీసులు తెలిపారు. అయితే ఈ ప్ర‌శ్నప‌త్రం బ‌య‌ట‌కు రావ‌డం వెనుక ప్ర‌తిప‌క్ష పార్టీ కి చెందిన నాయ‌కుడి పాత్ర‌ ఉన్న‌ట్లు , ఈ నాయ‌కుడు గ‌తంలో ఓ న్యూస్ చానెల్ రిపోర్ట‌ర్‌గా కూడా ప‌ని చేసిన‌ట్లు పోలీసులు పేర్కొన్నారు. అన్ని కోణాల్లో ద‌ర్యాప్తు చేస్తున్నామ‌ని, ఏ పాఠ‌శాల నుంచి పేప‌ర్ బ‌య‌ట‌కు వ‌చ్చింద‌నే అంశంపై ఆరా తీస్తున్నామ‌ని వ‌రంగ‌ల్ సీపీ రంగ‌నాథ్ తెలిపారు. అత‌నికి ఎవ‌రు ప్ర‌శ్నప‌త్రం పంపార‌నే విష‌యంపై దృష్టి సారించిన‌ట్లు పేర్కొన్నారు.