High Court verdict on KTR quash petition today

కేటీఆర్ క్వాష్ పిటిషన్ పై నేడు హైకోర్టు తీర్పు

హైదరాబాద్‌: నేడు కేటీఆర్ క్వాష్ పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు తీర్పు ఇవ్వనుంది. కేటీఆర్ క్వాష్ పిటిషన్ పై ఇటీవల వాదనలు..ముగిశాయి. వాదనలో కేటీఆర్ క్వాష్ ను కొట్టివేయ్యాలని ఏసీబీ పేర్కొంది. ఇరు పక్షాల వాదనల అనంతరం కోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. తీర్పు వెల్లడించే వరకు కేటీఆర్ ను అరెస్టు చేయవద్దన్న హైకోర్టు…ఇవాళ ఉదయం 10:30 న్నర గంటల సమయాన తీర్పు వెల్లడించనుంది.

image
image

నేడు హైకోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ ఉంది. ఇప్పటికే ఏసీబీ విచారణకు మాజీమంత్రి కేటీఆర్ లీగల్ టీంతో వెళ్లారు. తన వెంట లీగల్ టీం ని అనుమతించకపోవడంతో ఏసీబీ విచారణకు కేటీఆర్ వెళ్లలేదు. దీంతో విచారణ అంశాన్ని కోర్టుకు దృష్టికి ఏసీబీ తీసుకెళ్లనుంది. ఇక ఇవాళ్టి తీర్పు మీదే కేటీఆర్ ఆశలు పెట్టుకున్నారు. ఏసీబీ, ఈడీ రెండు దర్యాప్తు సంస్థల దర్యాప్తుతో ఫార్ములా ఈ రేస్ కొనసాగుతోంది. కోర్టు తీర్పు నేపథ్యంలో ఈరోజు విచారణకు హాజరు కాలేనని ఈడికి తెలిపారు కేటీఆర్. బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ రిక్వెస్ట్ ని ఆమోదించిన ఈడి తదుపరి విచారణ తేదీ ప్రకటించలేదు.

అయితే నేడు ఈడీ విచారణకు రావాలని కేటీఆర్ కు నోటీసులు అందాయి. అయితే తాను విచారణకి హాజరు కాలేనని ఈడి ఇచ్చిన నోటీసులకి కేటీఆర్ లేఖ రాశారు. ఏసీబీ తనపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ను రద్దు చేయాలని ఇప్పటికే హైకోర్టులో వేసిన కేసులో తీర్పు రిజర్వు ఉందని, హైకోర్టు పైన ఉన్న గౌరవంతో… హైకోర్టు తీర్పును వెలువరించేంతవరకు ఈ అంశంలో తనకు సమయం ఇవ్వాలని కోరారు. తర్వాత పంపిన తేదీకి తప్పక రావాల్సి ఉంటుందని ఈడీ నుంచి కూడా కేటీఆర్ కు సమాధానం వచ్చింది.

Related Posts
ప్రస్తుతం యువత ఐటీ ఉద్యోగాలవైపే మొగ్గు : సీఎం
At present youth are inclined towards IT jobs .. CM revanth reddy

దేశ రక్షణ కోసం అవసరమైన ఇంజినీర్లను తయారుచేయడం మరింత ముఖ్యం హైదరాబాద్‌: ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో కలిసి గచ్చిబౌలి స్టేడియంలో డీఆర్‌డీవో ఆధ్వర్యంలో Read more

ఏపీ నూతన డీజీపీ ఈయనేనా..?
ap new dgp harish kumar gup

ఆంధ్రప్రదేశ్‌లో డీజీపీ ద్వారకా తిరుమలరావు పదవీ విరమణ సమయం దగ్గరపడుతుండడంతో నూతన డీజీపీ నియామకంపై చర్చలు ముమ్మరంగా సాగుతున్నాయి. ప్రస్తుతం విజయనగరం జిల్లాకు చెందిన హరీశ్ కుమార్ Read more

12 లక్షల వరకు ఎలాంటి ట్యాక్స్ లేదు : నిర్మలా సీతారామన్‌
No tax up to 12 lakhs: Nirmala Sitharaman

న్యూఢిల్లీ: ఆర్థిక సంవత్సరానికి చెందిన బడ్జెట్‌ను ఎన్డీయే సర్కార్‌ పార్లమెంటులో ప్రవేశ‌పెట్టారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ లోక్‌సభలో బ‌డ్జెట్‌ను చ‌ద‌వి వినిపిస్తున్నారు. మధ్య తరగతి Read more

అమృత-ప్రణయ్ కేసులో రంగనాథ్ ఏమన్నారంటే
అమృత-ప్రణయ్ కేసులో రంగనాథ్ ఏమన్నారంటే

అమృత-ప్రణయ్ పరువు హత్య కేసులో నల్గొండ ఎస్పీ రంగనాథ్ కీలక మిర్యాలగూడలో సంచలనం సృష్టించిన అమృత-ప్రణయ్ పరువు హత్య కేసు దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీశింది. ఈ Read more