telangana new highcourt wil jpg

హైడ్రా కూల్చివేతలపై ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు

ts-high-court

హైదరాబాద్‌: హైడ్రా కూల్చివేతలపై రాష్ట్రంలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. హైదరాబాద్‌లోని చెరువులు, నాలాలను కబ్జా చేసి నిర్మించిన అక్రమ కట్టడాలను హైడ్రా కూల్చివేస్తున్న విషయం తెలిసిందే.అయితే, హైడ్రా చర్యల కారణంగా కొందరు నిరుపేదలు సైతం రోడ్డున పడుతున్నారు.తమను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.ఈ క్రమంలోనే హైడ్రా కూల్చివేతలపై ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు కేఏ పాల్ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వెంటనే హైడ్రా కూల్చివేతలను ఆపివేయాలని కోర్టుకు విన్నవించారు.

జీఓ నంబర్ 99పై స్టే విధించాలని కేఏ పాల్ తరపున న్యాయవాది హైకోర్టులో వాదనలు వినిపించడంతో పాటు.. కూల్చివేతలకు కనీసం 30 రోజుల ముందే నోటీసులు ఇవ్వాలని కోరారు.హైడ్రాకు చట్టబద్ధత కల్పించాకే కూల్చివేతలు చేపట్టాలని కేఏ పాల్ కోరారు.అయితే, ఇప్పటికిప్పుడు కూల్చివేతల్ని ఆపలేమని న్యాయస్థానం స్పష్టంచేసింది.ఈ పిటిషన్‌లో ప్రతివాదులుగా ఉన్న హైడ్రా, ప్రభుత్వానికి వెంటనే కౌంటర్ దాఖలు చేయాలని నోటీసులు జారీ చేస్తూ.. తదుపరి విచారణను అక్టోబర్ 14కు వాయిదా వేసింది.

Related Posts
ICC జారీ చేసిన అరెస్ట్ వారెంట్‌ను తిరస్కరించిన ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ..
netanyahu 1

ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ గాజా యుద్ధం నిర్వహణపై అంతర్జాతీయ నేరాల కోర్టు (ICC) ఆయనకు జారీ చేసిన అరెస్ట్ వారెంట్‌ను తిరస్కరించారు. ఈ నిర్ణయాన్ని ఆయన Read more

ఆంధ్రప్రదేశ్‌లో రూ.47,776 కోట్ల పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్!
ఆంధ్రప్రదేశ్‌లో రూ.47,776 కోట్ల పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్!

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (SIPB) రూ. 44,776 కోట్ల పెట్టుబడులతో కూడిన 15 ప్రాజెక్టులకు గురువారం ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు Read more

ఫిబ్రవరి 15 లోపే పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌..!
Panchayat election schedule before February 15.

హైదరాబాద్‌: పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ ఫిబ్రవరి 15 లోపే విడుదలయ్యే అవకాశం ఉన్నదని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ఆదివారం ఖమ్మం జిల్లాలో పర్యటిచిన Read more

ISRO: ప్రపంచ వ్యాప్తంగా భారతదేశం స్పేస్ శక్తిగా ఎదుగుతోంది
isro 1

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) 15 ఆగస్ట్ 1969 లో స్థాపనైనప్పటి నుంచి ఎన్నో విజయాలు సాధించింది. ప్రస్తుతం, ISRO ప్రపంచంలోని అతిపెద్ద అంతరిక్ష సంస్థలలో Read more