వైసీపీకి తాత్కాలిక ఊరట

YCP is against privatization of Visakha Steel Plant: CM Jagan

ఏపీలో అధికార, విపక్షాల మధ్య పార్టీ ఆఫీసుల వివాదం తీవ్ర దుమారం రేపుతోంది. అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఆదేశాలతో సీఆర్డీయే అధికారులు అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపారు. అందులో భాగంగా వైసీపీ కార్యాలయాలపై ఫోకస్ పెట్టారు. గత రెండు రోజుల క్రితం మంగళగిరిలో నిర్మాణంలో ఉన్న వైసీపీ కేంద్రకార్యాలయాన్ని యుద్దప్రాతిపదికన సీఆర్డీఏ అధికారులు కూల్చేశారు. అలాగే రాష్ట్రంలోని పలు వైసీపీ పార్టీకి సంబంధించిన జిల్లా కార్యాలయాలకు నోటీసులు పంపించింది.

రాష్ట్రవ్యాప్తంగా నిర్మాణంలో ఉన్న 16 వైసీపీ కార్యాలయాలు అక్రమ కట్టడాలంటూ ఏపీ ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులను సవాల్‌ చేస్తూ వైసీపీ ఏపీ హైకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్ పై విచారించిన హైకోర్టు గతంలో విధించిన స్టేటస్ కోను కొనసాగిస్తున్నట్లు తెలిపింది. దీంతో వైసీపీకి తాత్కాలిక ఊరట లభించిందని చెప్పొచ్చు.