హైడ్రా పై హై కోర్ట్ ఆగ్రహం

హైడ్రా పై హై కోర్ట్ ఆగ్రహం

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని చెరువులు, కుంటలు, ప్రభుత్వ స్థలాల పరిరక్షణ కోసం హైడ్రా వ్యవస్థను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. చెరువుల ఎఫ్‌టీఎల్, బఫర్‌జోన్లు ఆక్రమించి నిర్మించిన అక్రమ కట్టడాలను హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు. బుల్డోజర్లు, జేసీబీల సాయంతో వాటిని నేలమట్టం చేస్తున్నారు. గతేడాది జులై నుంచి ఇప్పటి వరకు దాదాపు 400 నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చేశారు. అయితే ఈ కూల్చివేతలు వివాదాస్పదం అవుతున్నాయి. హైడ్రా అధికారులు వీకెండ్‌లో కూల్చివేతలు చేపడుతున్నారని పలువురు బాధితులు వాపోతున్నారు. తాము కోర్టులను ఆశ్రయించే వీల్లేకుండా.. కావాలనే సెలువు దినాల్లో కూల్చివేతలు చేపడుతున్నారని అంటున్నారు.

383557 hydra

ఈ వ్యవహారంపై గతంలో హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వీకెండ్‌లో కూల్చివేతలు చేపట్టడమేంటని ప్రశ్నించింది. స్వయంగా హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ హైకోర్టు జడ్జి ముందు హాజరు కావాల్సి వచ్చింది. అయినా మరోసారి వీకెండ్‌లో కూల్చివేతలు చేపట్టడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్నిసార్లు చెప్పినా మారరా..? అంటూ తీవ్రస్థాయిలో ఫైరయింది. సెలవు దినాల్లోనే ఎందుకు కూల్చాల్సి వస్తుందని హైకోర్టు ధర్మానసం నిలదీసింది. కూల్చివేతల్లో ఎందుకంత హడావుడి చేస్తున్నారని తీవ్రస్థాయిలో మండిపడింది. నోటీసులిచ్చి తగిన వివరణ ఇచ్చేదాకా ఆగకుండా కూల్చాల్సిన అవసరం ఏముందని హైడ్రా అధికారులను ప్రశ్నించింది. నోటీసులు జారీచేసిన వెంటనే సమాధానం ఇవ్వడానికి తగిన గడువు ఇవ్వకుండా కూల్చివేస్తారా..? అని ఫైర్ అయింది.

అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం కోహెడాలోని ఆదివారం పలు అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చేశారు. ఈ కూల్చివేతలు చేపట్టడాన్ని సవాల్‌ చేస్తూ బాల్‌రెడ్డి అనే వ్యక్తి అత్యవసరంగా హైకోర్టులో హౌస్‌మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేశాడు. పిటిషన్‌ను జస్టిస్‌ కే లక్ష్మణ్‌ నేతృత్వంతలోని బెంచ్ విచారించింది. పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. శుక్రవారం నోటీసులు ఇచ్చి..శనివారమే వివరణ ఇవ్వాలని నోటీసుల్లో ఆదేశించారన్నారు. ఆ తర్వాత వివరణ తీసుకోకుండానే.. హడావుడిగా ఆదివారమే కూల్చివేతలు చేపట్టారని తెలిపారు. నోటీసులు జారీచేశాక ఆధారాలు సమర్పించి, వివరణ ఇవ్వడానికి గడువు ఇవ్వలేదని.. అలోపే కూల్చివేతలు చేపట్టడం దారుణమన్నారు.
పిటిషన్ తరపు న్యాయవాది వాదనలను పరిగణలోనికి తీసుకున్న హైకోర్టు జడ్జి లక్ష్మణ్.. ఎన్నిసార్లు చెప్పినా హైడ్రా తీరు మారడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూల్చివేతలను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. నోటీసులపై వారంలోగా సమాధానమివ్వాలని పిటిషనర్‌ను న్యాయస్థానం ఆదేశించింది.ఈ హై కోర్టు ఆగ్రహం దేశవ్యాప్తంగా గొప్ప చర్చకు దారితీసింది. హైడ్రా వంటి గ్యాంగ్‌ల ద్వారా ప్రజల భద్రత, సామాజిక శాంతి కూలగొట్టబడుతున్న నేపథ్యంలో, ప్రజలు, రాజకీయ పార్టీలు, మరియు న్యాయవాదులు ఈ అంశంపై చర్చించేందుకు సిద్ధమవుతున్నారు.

Related Posts
భూగర్భజలాలపై కేటీఆర్ ఆందోళన
భూగర్భజలాలపై కేటీఆర్ ఆందోళన

తెలంగాణలో భూగర్భజల మట్టాలు పడిపోతుండటంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల నాలుగు నెలల్లోనే భూగర్భజల మట్టం Read more

ప్రభుత్వాన్ని నడపడమంటే పైసలు పంచడం కాదు : కేటీఆర్
Running a government is not about distributing money. KTR

హైదరాబాద్‌: మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ .. ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పిస్తున్నారు. కాంగ్రెస్ 15 నెలల Read more

DavidWarner: రాబిన్ హుడ్ మూవీ ప్రమోషన్స్ కోసం హైదరాబాద్ చేరుకున్న డేవిడ్ వార్నర్
DavidWarner:ఎయిర్ఇండియా సేవలపై అసంతృప్తి వ్యక్తం చేసిన డేవిడ్ వార్నర్

నితిన్,శ్రీలీల జంటగా నటించిన చిత్రం ‘రాబిన్ హుడ్’. ఈ సినిమాను ‘భీష్మ’ ఫేమ్ వెంకీ కుడుముల దర్శకత్వం వహించగా, ‘పుష్ప 2’ ఫేమ్ మైత్రి మూవీ మేకర్స్ Read more

ఇంకా మారకపోతే మార్చురీకి పోతారు: కవిత
kavitha comments on cm revanth reddy

హైరదాబాద్‌: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరోసారి ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిపై విమర్శలు గుప్పించారు. తన తండ్రి కేసీఆర్ ను ఉద్దేశించి రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు Read more