గణేశ్ మండపాలకు చలాన్లు ఎందుకు..? – హీరోయిన్ మాధవీలత

ఏపీ హోంమంత్రి అనితపై హీరోయిన్ ఎం బిజెపి నేత మాధవీలత ఆగ్రహం వ్యక్తం చేసారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో గణేష్ నవరాత్రులు మొదలయ్యాయి. ఊరూవాడ జైజై గణేశా అంటూ ఆ విఘ్నేశ్వరుడికి ఘనస్వాగతం పలికారు. తొమ్మిది రోజుల పాటు ఆ లంబోదరుడికి పూజలు చేసి తరిస్తారు. అయితే ఏపీలో గణేశ్ మండపాల్లో మైక్ పర్మిషన్ కు, విగ్రహం ఎత్తును బట్టి చలాన్లు కట్టాలని హోంమంత్రి అనిత చేసిన వ్యాఖ్యలపై యావత్ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. BJP నేత మాధవీలత దింపి రియాక్ట్ అయ్యారు. ‘అనితక్కా.. ఏంది నీ తిక్క. ఈ కూటమిలో మా పార్టీ ఉన్నప్పటికీ తప్పును ఖండిస్తా. ప్రతి వాళ్లకూ హిందూ పండగలపై పడి ఏడవడం తప్ప పనిలేదా? మైక్ పర్మిషన్ కు రూ.100, విగ్రహాలకు రూ.350 ఇవ్వాలా?. ఇదే రూల్ క్రిస్టియన్లు, ముస్లింలకు పెట్టండి’ అని ఫైరయ్యారు.