పోలీసులతో ‘డబుల్ ఇస్మార్ట్’ మీట్

తెలంగాణ పోలీస్ అకాడెమీలో ఏర్పాటు చేసిన ఇండిపెండెన్స్ డే స్పెషల్ ప్రోగ్రాంలో హీరో రామ్ సందడి చేసారు. డాషింగ్ డైరెక్టర్ పూరి – హీరో రామ్ కలయికలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ మూవీ ఎంత పెద్ద హిట్ అయ్యిందో చెప్పాల్సిన పనిలేదు. రామ్ కెరియర్ లోనే భారీ హిట్ అయ్యింది. అప్పటి వరకు వరుస ప్లాప్స్ తో కొట్టుమిట్టాడుతున్న రామ్ – పూరి లకు ఈ మూవీ ఊపిరి పోసింది. ఈ మూవీ తర్వాత పలు ప్లాప్స్ అందుకున్న పూరి – రామ్ లు చాల గ్యాప్ తర్వాత డబుల్ ఇస్మార్ట్ అంటూ ఈ నెల 15 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

ఇప్పటికే ఈ మూవీ సాంగ్స్ , ట్రైలర్ సినిమాపై ఆసక్తి నింపగా.. చిత్ర ప్రమోషన్స్ సైతం అంచనాలు పెంచేస్తున్నాయి. తాజాగా మూవీ ప్రమోషన్స్లో భాగంగా తెలంగాణ పోలీస్ అకాడెమీలో ఏర్పాటు చేసిన ఇండిపెండెన్స్ డే స్పెషల్ ప్రోగ్రాంలో హీరో రామ్ పాల్గొన్నారు. అక్కడున్న ఉన్నతాధికారులతో పాటు ట్రైనీ పోలీసులతో ఇంటరాక్ట్ అయ్యారు. ఇంటర్వ్యూ వీడియోను ఈనెల 15న రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటిస్తూ కొన్ని ఫొటోలను పంచుకున్నారు.

డబుల్ ఇస్మార్ట్ సినిమాలో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ పవర్ ఫుల్ క్యారెక్టర్ చేస్తున్న విషయం తెలిసిందే. పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై పూరి జగన్నాధ్, ఛార్మి కౌర్ గ్రాండ్‌గా నిర్మించిన ఈ సినిమాలో రామ్ పోతినేనికి జోడీగా కావ్య థాపర్ నటించింది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.