రేవ్ పార్టీ కేసు.. నటి హేమకు షాక్..

Bengaluru rave party case..Notices to actress Hema

బెంగళూరు రేవ్ పార్టీ కేసులో పోలీసులు ఛార్జ్ షీట్ నమోదు చేశారు. నటి హేమ డ్రగ్స్ తీసుకున్నట్లు అందులో పేర్కొన్నారు. మొత్తం 9 మంది రేవ్ పార్టీని నిర్వహించారని, హేమతో పాటు 88 మంది డ్రగ్స్ తీసుకున్నట్లు తెలిపారు. హేమ MDMA డ్రగ్స్ తీసుకున్నట్లు మెడికల్ రిపోర్టును జతపరిచారు. పార్టీ నిర్వహించిన 9 మందిపై ఇతర సెక్షన్‌ల కింద కేసులు నమోదు చేశారట. ఎన్డీపీఎస్ సెక్షన్ 27 కింద హేమను నిందితురాలిగా పోలీసులు పేర్కొన్నారని సమాచారం.

రేవ్ పార్టీలో ఆమె పట్టుబడినా కూడా మీడియాని, జనాల్ని, పోలీసుల్ని తప్పుదోవ పట్టించేందుకు చాలా ప్రయత్నాలు చేసింది. ఇంట్లోనే ఉన్నాను.. ఫాం హౌస్‌లో ఉన్నాను అంటూ నాటకాలు ఆడింది. వీడియోలు రిలీజ్ చేసింది. వంటగదిలో బిర్యానీ చేశానంటూ ఇలా వీడియోలని వదిలి నాటకాలు బాగానే ఆడింది. తెరపైనే కాకుండా ఇలా రియల్‌గానూ నటించే ప్రయత్నం చేసింది. కానీ ఆమె నట విశ్వరూపానికి జనాలు పడిపోలేదు. ఆమె అసలు రంగు తెలుసుకుని నవ్వుకున్నారు.