విస్తరణలో పథంలో ఉన్న హీలియోస్..తెలంగాణలో 7 కొత్త స్టోర్లు

Helios on expansion path..7 new stores in Telangana

హైదరాబాద్‌: హిమాయత్‌నగర్ మరియు సోమాజిగూడ స్టోర్‌లను పూర్తి సరికొత్త అందంతో పునఃప్రారంభించింది. టైటాన్ కంపెనీ లిమిటెడ్ కు చెందిన  వాచ్ స్టోర్, హీలియోస్, ఈరోజు హిమాయత్‌నగర్ మరియు సోమాజిగూడలో ఉన్న తమ రెండు అవుట్‌లెట్‌లను పూర్తి సరికొత్త  అందం మరియు బ్రాండింగ్‌తో పునఃప్రారంభించింది. టైటాన్ కంపెనీ లిమిటెడ్, CSMO (చీఫ్ సేల్స్ & మార్కెటింగ్ ఆఫీసర్), శ్రీ రాహుల్ శుక్లా మరియు టైటాన్ కంపెనీ లిమిటెడ్ రిటైల్ హెడ్ శ్రీ జావేద్ కె ఎం  సమక్షంలో ఈ బ్రాండ్ అవుట్‌లెట్‌లు ప్రారంభమయ్యాయి. ఈ నూతన స్టోర్స్ పునః ప్రారంభం సందర్భంగా  తెలంగాణలో తమ విస్తరణ ప్రణాళికలను హీలియోస్ ఆవిష్కరించింది. ఇది ఆర్థిక సంవత్సరం 2025’లో మరో 7 స్టోర్‌లను ప్రారంభించే ప్రణాళికలతో ఈ ప్రాంతంలోని మొత్తం స్టోర్‌ల సంఖ్యను 9కి తీసుకువెళుతుంది.ఈ ప్రాంతంలో ఇప్పటికే ఉన్న స్టోర్స్  ఆకట్టుకునే పనితీరును కనబరిచాయి, సోమాజిగూడ స్టోర్‌లో  అమ్మకాలు 11% పెరిగాయి మరియు హిమాయత్‌నగర్ స్టోర్‌లో 10% పెరుగుదల కనిపించింది. మొత్తం మీద తెలంగాణ గణనీయంగా  14 శాతం వృద్ధిని సాధించింది. కొత్త స్టోర్‌లు విభిన్న రకాల ఉత్పత్తులను కలిగి ఉంటాయి, వివిధ సందర్భాలకు తగినట్లుగా అసాధారణమైన డిజైన్‌లతో 45 అంతర్జాతీయ బ్రాండ్‌లను ఈ స్టోర్స్ ప్రదర్శిస్తాయి, విభిన్నమైన కస్టమర్ ప్రాధాన్యత అవసరాలను తీరుస్తాయి. ఈ ముఖ్యమైన విస్తరణ దేశవ్యాప్తంగా 200 కు పైగా  స్టోర్‌లతో మార్కెట్ లీడర్‌గా హీలియోస్ స్థానాన్ని పటిష్టం చేసింది. ఈ కాలంలో, బ్రాండ్ 10 నుండి 12 కోట్ల వ్యూహాత్మక పెట్టుబడిని పెట్టడానికి సిద్ధంగా ఉంది, ఈ ఆవిష్కరణ  విజయవంతమవడానికి మరియు మార్కెట్ లో తమ కార్యకలాపాలను  మరింత విస్తృతం చేయడానికి దాని నిబద్ధతను ప్రతిబింబిస్తుంది. బ్రాండ్ ఇప్పుడు కొత్త స్టోర్ విస్తరణలపై దృష్టి సారిస్తోంది. ఇప్పటికే ఉన్న కీలకమైన స్టోర్‌లను పునరుద్ధరించడం మరియు ప్రస్తుతం కార్యకలాపాలు నిర్వహిస్తున్న ప్రాంతాలలో కార్యాచరణ సామర్థ్యాన్ని మెరుగుపరచటం చేస్తుంది. ఈ వ్యూహం గత సంవత్సరంలో రెండంకెల ఆదాయ వృద్ధిని సాధించేందుకు దోహద పడింది, ఇది కంపెనీ యొక్క స్థిరత్వం  మరియు కస్టమర్ ఆకర్షణను నొక్కి చెబుతుంది.

ఈ ప్రారంభోత్సవంలో  టైటాన్ కంపెనీ లిమిటెడ్, CSMO (చీఫ్ సేల్స్ & మార్కెటింగ్ ఆఫీసర్) శ్రీ రాహుల్ శుక్లా మాట్లాడుతూ, “అపారమైన వృద్ధి సామర్థ్యం మరియు వ్యూహాత్మక ప్రాముఖ్యతను సూచించే నగరంలో మా స్టోర్‌లను పునఃప్రారంభించినందుకు మేము సంతోషిస్తున్నాము. భారతదేశంలోని అతిపెద్ద ఐటి కేంద్రాలలో  ఒకటిగా మరియు వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో ఒకటిగా, హైదరాబాద్ కొత్త రిటైల్ క్యాచ్‌మెంట్‌లతో మరియు కొనుగోలు సామర్థ్యంలో గణనీయమైన పెరుగుదలతో వేగంగా విస్తరిస్తోంది. ఈ సానుకూల ధోరణులతో, మేము గత సంవత్సరంతో పోలిస్తే 35% ఆదాయ వృద్ధిని లక్ష్యంగా పెట్టుకున్నాము. ఆర్థిక సంవత్సరం 2025 కోసం మా ప్రతిష్టాత్మక వృద్ధి లక్ష్యాలను సాధించడంలో ఈ స్థానాలు కీలకంగా ఉంటాయని మేము విశ్వసిస్తున్నాము మరియు దేశవ్యాప్తంగా ఉన్న మా కస్టమర్‌లకు అసమానమైన రిటైల్ అనుభవాన్ని అందించడానికి ఆసక్తిగా  మేము ఎదురుచూస్తున్నాము” అని అన్నారు. వాచ్ ప్రేమికులు టిస్సో , మొవాడో, యు-బోట్, సీకో, వెర్సస్, టామీ హిల్‌ఫిగర్, ఫాసిల్ గ్రూప్, పోలీస్ మరియు కెన్నెత్ కోల్‌తో సహా అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన బ్రాండ్‌ల నుంచి ఎంపికచేసిన కలెక్షన్  ను అన్వేషించవచ్చు. ముఖ్యంగా, సోమాజిగూడ స్టోర్ ప్రత్యేకంగా ఇటాలియన్ బ్రాండ్ యు -బోట్‌ను కలిగి ఉంటుంది, మొత్తం కస్టమర్ అనుభవాన్ని మెరుగుపరచడంలో హీలియోస్ నిబద్ధతను పునరుద్ఘాటిస్తుంది.