కుంభమేళా లో భారీ ట్రాఫిక్ జామ్ తో భక్తుల యాతనలు..

కుంభమేళా లో భారీ ట్రాఫిక్ జామ్ తో భక్తుల యాతనలు..

ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న మహా కుంభమేళాకు భక్తులు పోటెత్తుతున్నారు. ఆదివారం పెద్ద సంఖ్యలో జనం కుంభమేళాకు బయలుదేరడంతో ప్రయాగ్ రాజ్ వెళ్లే మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ప్రపంచంలోనే అతిపెద్ద ట్రాఫిక్ జామ్ ఇదేనని, సుమారు 300 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయని అధికార వర్గాల సమాచారం. హైవేపై భారీ ట్రాఫిక్ జామ్ కారణంగా ముందుకు వెళ్లలేక, వెనక్కి తిరిగి రాలేక జనం అవస్థలు పడుతున్నారు. ఆకలిదప్పులతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గంటల తరబడి ట్రాఫిక్ కదలడంలేదని, ప్రయాగ్ రాజ్ ఇంకా 300 కిలోమీటర్ల దూరం ఉందని ఓ వాహనదారుడు చెప్పారు. మరోవైపు, భక్తుల రద్దీ కారణంగా సంగం రైల్వే స్టేషన్ ను అధికారులు వచ్చే శుక్రవారం వరకు మూసివేశారు.

యూపీ సర్కారు వైఫల్యం వల్లే కుంభమేళాకు వెళుతున్న భక్తులు అవస్థలు ఎదుర్కొంటున్నారని సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ ఆరోపించారు. హైవేపై ట్రాఫిక్ జామ్ వీడియోను షేర్ చేస్తూ… దీనికి సీఎం యోగి అసమర్థతే కారణమని మండిపడ్డారు. ట్రాఫిక్ జామ్ ను క్లియర్ చేసేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కుంభమేళా నిర్వహణలో యోగి ప్రభుత్వం విఫలమైందనే దానికి ఈ ట్రాఫిక్ జామే కారణమని అఖిలేశ్ చెప్పుకొచ్చారు. ప్రతిచోట వాహనాల రద్దీ నెలకొనడంతో భక్తులకు ఆహార ధాన్యాలు, కూరగాయలు, ఔషధాలు, పెట్రోల్‌, డీజిల్‌ వంటివి అందటంలేదని, ఆహారం, విశ్రాంతి లేక భక్తులు నీరసించిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

కుంభమేళాలో ట్రాఫిక్ జామ్ ఎలా ఏర్పడింది?

భారీ భక్తుల రద్దీ – కోటి మంది భక్తులు ఈ ఏడాది కుంభమేళాకు హాజరయ్యారు.

ప్రయాణ ఏర్పాట్లలో లోపాలు – తాత్కాలిక రహదారుల నిర్వహణ క్షీణించడంతో ట్రాఫిక్ సమస్యలు తీవ్రంగా మారాయి.

వాహనాల పెరుగుదల – లక్షలాది భక్తులు కార్లు, బస్సులు, ద్విచక్ర వాహనాలతో రావడం రోడ్లపై తీవ్ర ఒత్తిడిని పెంచింది.

పోలీసుల అనుసరణలో లోపాలు – ట్రాఫిక్ నియంత్రణ కోసం వేసిన ప్రణాళికలు సరిగ్గా అమలు కాకపోవడం.

Related Posts
రాజీనామా యోచనలో కెనడా ప్రధాని..!
Canadian Prime Minister Justin Trudeau plans to resign

కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో రాజీనామా చేసే యోచనలో ఉన్నారని సమాచారం. లిబరల్ పార్టీతో పాటు ప్రధాని పదవి నుంచి కూడా ఆయన తప్పుకునే అవకాశముందని సన్నిహిత Read more

బాలీవుడ్‌ న‌టుడు గోవిందాకు బుల్లెట్ గాయాలు
actor govind

బాలీవుడ్‌ నటుడు, శివసేన లీడర్‌ గోవిందా ఇంట్లో గన్‌ మిస్‌ఫైర్‌ అయ్యింది. ప్రమాదవశాత్తు జరిగిన ఈ ఘటనలో గోవిందాకు తీవ్ర గాయాలయ్యాయి. ఇవాళ తెల్ల‌వారుజామున 4.45 గంట‌ల Read more

ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న అండర్ వరల్డ్ డాన్
ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న అండర్ వరల్డ్ డాన్

ఒకప్పుడు దావూద్ ఇబ్రహీం సన్నిహితుడిగా ఉన్న ఛోటా రాజన్, 2001లో హోటల్ యజమాని జయ శెట్టి హత్య కేసుకు సంబంధించి 2024లో జీవితఖైదు శిక్షను అనుభవిస్తున్నాడు. అయితే, Read more

శబరిమల భక్తులకు దేవస్థానం బోర్డు శుభవార్త
Good news from the temple board for Sabarimala devotees

తిరువనంతపురం: కేరళలోని శబరిమల అయ్యప్ప స్వామి భక్తులకు ట్రావన్‌కోర్‌ దేవస్థానం బోర్డు శుభవార్త చెప్పింది. సన్నిధానం వద్ద 18 మెట్లను నేరుగానే ఎక్కి అయ్యప్ప స్వామిని దర్శనం Read more