తెలంగాణ ప్రజలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అలర్ట్

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అలర్ట్ జారీ చేసింది. బంగాళాఖాతం వరకు సముద్ర మట్టానికి 1.5 కి.మీ ఎత్తులో రుతుపవన ద్రోణి కొనసాగుతుండడం తో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రెండు మూడు రోజుల్లో అతి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉరుములు, మెరుపులతో గంటకు 30 నుంచి 40 కి.మీ. మీ ప్రకారం, అప్పుడప్పుడు గంటకు 50 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. ములుగు, మహబూబాబాద్, ఖమ్మం, భద్రాది కొత్తగూడెం జిల్లాలకు రెడ్ అలెర్ట్ ప్రకటించగా.. కరీంనగర్, భూపాలపల్లి, కొమరంభీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, వరంగల్, హనుమకొండ జిల్లాలకు ఐఎండీ ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది.

ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. నిన్న బంగాళాఖాతలో ఏర్పడిన అల్పపీడనంతో మరికొన్ని గంటల్లో బలపడి తీవ్ర వాయుగుండంగా మారనున్న అల్పపీడనంగా మారి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. హైదరాబాద్ తో పాటు పరిసర జిల్లాలకు మోస్తరు నుంచి భారీ వర్ష సూచన తెలిపింది. ఐఎండీ జిల్లాల అధికారులను అలెర్ట్ చేసింది. అవసరమైతే తప్ప బయటకు రావద్దని ప్రజలకు సూచించింది.

ఇదిలా ఉంటె భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం గుమ్మడవల్లి సమీపంలోని పెదవాగు ప్రాజెక్టుకు భారీగా వరద చేరింది. స్థాయికి మించి జలాలు రావడం వల్ల వాగు కట్టకు రెండుచోట్ల గండి పడింది. దీంతో అప్రమత్తమైన అధికారులు లోతట్టు ప్రాంతంలో ఉండే గుమ్మడవల్లి గ్రామంలోని 300 కుటుంబాలు, కొత్తూరు గ్రామంలోని 200 కుటుంబాల ప్రజలను అప్రమత్తం చేశారు. ప్రాజెక్టుకు రెండుచోట్ల గండిపడిన దృష్ట్యా.. ఎప్పుడు ఎలాంటి ప్రమాదం ముంచుకొస్తుందో తెలిసే పరిస్థితి లేదని ఆయా గ్రామాల ప్రజలకు వివరించారు.