ఈరోజు ఈ జిల్లాలో అత్యంత భారీ వర్షాలు..

అరేబియా సముద్రంలో ఏర్పడిన అస్నా తుఫాను ప్రభావంతో రేణు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో రెండ్రోజులు భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదన్న వాతావరణశాఖ హెచ్చరికలతో అప్రమత్తమైన ప్రభుత్వం ముందస్తు చర్యలు ప్రారంభించింది. ఇక ఈరోజు (సెప్టెంబర్ 1) తెలంగాణలో చూస్తే… ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, మహబూబాబాద్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాల్లో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది.

అలాగే ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్, హన్మకొండ, జనగాం, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ అయ్యాయి. సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, సిద్దిపేట, యాదాద్రి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్‌ మల్కాజిగిరి, మెదక్‌ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి. భారీ వర్షాల నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తం చేసింది. ఈ రెండు రోజులు ప్రజల ఇళ్ల నుండి బయటకు వెళ్లోద్దని సూచించింది. పాతభవనాలు నుండి బయటకు వెళ్లాలని హెచ్చరించింది.