తెలంగాణ లో నాల్గు రోజుల పాటు వర్షాలే వర్షాలు

తెలంగాణ లో భారీ వర్షాలు వదలడం లేదు..గత కొద్దీ రోజులుగా వర్షాలు పడుతూనే ఉన్నాయి. తాజాగా మరో నాల్గు రోజుల పాటు పలు జిల్లాలో కురవనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఆదిలాబాద్‌, జగిత్యాల, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, ములుగు, కరీంనగర్‌తోపాటు మెదక్‌లో ఇవాళ ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే… నిర్మల్‌, సంగారెడ్డి, మెదక్‌, నిజామాబాద్‌, కామారెడ్డి, రంగారెడ్డి, వికారాబాద్‌ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని హెచ్చరించింది. ఈ ఏడు జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని తెలిపింది.

రేపు నిజామాబాద్‌, కామారెడ్డి, జగిత్యాల, కరీంనగర్‌, ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, భూపలపల్లి, పెద్దపల్లి, జనగామ, జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. అలాగే.. హైదరాబాద్‌తోపా సమీప జిల్లాలు అయిన మేడ్చల్‌, వికారాబాద్‌, మెదక్‌, భువనగిరి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు సమాచారం. కనుక.. ఆ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.