Heavy rains in Chennai. Red alert

చెన్నైలో కుండపోతగా వర్షాలు.. రెడ్‌ అలర్ట్‌

చెన్నై: ఈశాన్య రుతుపవనాల ఆగమనం, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా బుధవారం తొమ్మిది జిల్లాల్లో కుండపోతగా వర్షాలు కురిసే అవకాశముందన్న వాతావరణ కేంద్రం ఆయా జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ ప్రకటించింది. సోమవారం అర్ధరాత్రి నుంచి చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్పట్టు జిల్లాల్లో కుండపోతగా వర్షాలు కురిశాయి. దీంతో ఆ నాలుగు జిల్లాల్లో జనజీవనం స్తంభించింది. చెరువులు, జలాశయాల్లో నీటి మట్టం వేగంగా పెరుగుతోంది. ఈ పరిస్థితుల్లో మంగళవారం చెన్నై సహా నాలుగు జిల్లాలకే పరిమితమైన రెడ్‌ అలర్ట్‌ మరో ఐదు జిల్లాలకు కూడా ప్రకటించడంతో ఆయా జిల్లాల ప్రజలంతా ఆందోళన చెందుతున్నారు.

బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అల్పవాయుపీడనం వాయుగుండంగా మారనుండటంతో చెన్నై, చెంగల్పట్టు, కాంచీపురం, తిరువళ్లూరు, రాణిపేట, తిరువణ్ణామలై, వేలూరు, కడలూరు, విల్లుపురం జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ ప్రకటించారు. ఈ జిల్లాల్లో బుధవారం ఉరుములు, మెరుపులు, పెనుగాలులతో కుండపోత వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. సముద్ర తీర ప్రాంతాల్లో గంటలకు 40 నుంచి 50 కి.మీల వేగంతో పెనుగాలులు వీస్తాయని ఈ నెల 18 వరకూ ఇదే పరిస్థితి కొనసాగుతుందని, జాలర్లు చేపలవేటకు వెళ్లరాదని హెచ్చరించారు. రాష్ట్రంలో ఉత్తర సముద్రతీర జిల్లాల్లోనూ పెనుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని అధికారులు పేర్కొన్నారు. మన్నార్‌ జలసంధి, కన్నియాకుమారి సముద్రతీరంలో గంటకు 35 నుండి 45 కి.మీ.ల వేగంతో పెనుగాలులు వీస్తాయని వివరించారు.

చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్పట్టు జిల్లాలకు వరద ముప్పు పొంచివుందని వాతావరణశాఖ ప్రకటించిన నేపథ్యంలో ఆయా జిల్లాల్లో ప్రభుత్వం సెలవు ప్రకటించింది. అయితే అత్యవసర సేవలందించే పోలీసు, అగ్నిమాపక, స్థానిక సంస్థలు, డైరీ తదితర శాఖలు, మెట్రో వాటర్‌ బోర్డు, ఆస్పత్రులు, మెడికల్‌ షాపులు, బ్యాంక్‌లు, విద్యుత్‌, ఎంటీసీ, చెన్నై మెట్రోరైల్‌, ఎమ్మార్టీఎస్‌ రైల్వే, విమానాశ్రయం, పెట్రోల్‌ బంక్‌లు, హోటళ్లు, వరద సహాయక చర్యల్లో పాల్గొనే శాఖలు యధావిధిగా పనిచేయనున్నాయి. కాగా హైకోర్టుతో పాటు పైన పేర్కొన్న నాలుగు జిల్లాల్లోని న్యాయస్థానాలకూ సెలవు ప్రకటించారు. ఇదిలా వుండగా బుధవారం కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి, కారైక్కల్‌లలోని విద్యాలయాలకు అక్కడి ప్రభుత్వం సెలవు ప్రకటించింది.

రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలకు డెల్టా జిల్లాలో 6500 ఎకరాల్లో కోతకు సిద్ధంగా ఉన్న వరి నీట మునిగింది. తంజావూరు, నాగపట్టినం, తిరువారూరు, మైలాడుదురై, పుదుకోట, తిరుచ్చి, కరూరు, అరియలూరు, పెరంబలూరు జిల్లాలో సోమవారం మధ్యాహ్నం నుండే చిరుజల్లులతో ప్రారంభమైన వర్షం సాయంత్రానికి తీవ్ర రూపం దాల్చింది. కుండపోతగా కురిసిన ప్రాంతాలకు జనజీవనం స్తంభించింది. పల్లపు ప్రాంతాలు జలమయమయ్యాయి.

Related Posts
భారతీయ ఐటీ నిపుణులకు న్యూజిలాండ్ ఈజీ వీసా
new zealand

అమెరికాలో భారతీయుల వీసా సమస్యలు ఒక పెద్ద చర్చాంశంగా మారాయి. వీసా విధానాల్లో మార్పులు, లేట్ అప్రూవల్, ప్రాసెసింగ్ సమయాలు పెరగడం వల్ల ఎన్నో ఆందోళనలు పెరిగాయి. Read more

కుటుంబ సర్వేపై విచారణ జరిపించాలి : షబ్బీర్ అలీ
CID should investigate comprehensive family survey.. Shabbir Ali

హైదరాబాద్‌: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన కొత్తలో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఆనాడు టీఆర్ఎస్ సర్కార్ నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేపై సీఐడీ Read more

ప్రమాదం నుండి తపించుకున్న పొంగులేటి
ప్రమాదం నుండి తపించుకున్న పొంగులేటి1

రెవెన్యూ మంత్రి వరంగల్ నుంచి ఖమ్మం తిరిగి వస్తుండగా తిరుమలయపాలెం వద్ద ఈ ఘటన జరిగింది. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఆదివారం సాయంత్రం ఖమ్మం Read more

కిస్నా డైమండ్ & గోల్డ్ జ్యువెలరీ “షాప్ అండ్ విన్ కార్” ఆఫర్
Kisna Diamond & Gold Jewelery brings joy with its Shop and Win Car offer

గుంటూరు : భారతీయ ఆభరణాల పరిశ్రమలో సుప్రసిద్ధమైన హరి కృష్ణ గ్రూప్ యొక్క ప్రముఖ బ్రాండ్ అయిన కిస్నా డైమండ్ & గోల్డ్ జ్యువెలరీ , సత్తెనపల్లిలోని Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *