అల్లూరి జిల్లాలో భారీ వర్షాలు..మూడు రాష్ట్రాల మధ్య నిలిచిన రాకపోకలు

గత వారం రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు పడుతున్న సంగతి తెలిసిందే. ఈ భారీ వర్షాలకు వాగులు , వంకలు , చెరువులు పొంగిపొర్లుతున్నాయి. ఇక అన్ని జలాశయాలు నిండడంతో కిందకు నీరు వదులుతున్నారు. ఇక అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు మూడు రాష్ట్రాల రాకపోకలు నిలిచిపోయాయి.

కూనవరం వద్ద గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. శబరి వద్ద గోదావరి నీటి మట్టం 40 అడుగులకు చేరడంతో నేషనల్ హైవేపై వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో ఆంధ్రప్రదేశ్-ఛత్తీస్ గఢ్-ఒడిశా మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. అటు చింతూరు ఏజెన్సీలో కుండపోత వర్షం పడుతోంది. దీంతో 120 గ్రామాలకు పైగా రాకపోకలు బంద్ అయ్యాయి. మరోవైపు భద్రాచలం- కూనవరం మధ్య రోడ్డుపై భారీగా వరద నీరు చేరింది. వద్దిగూడెం, శ్రీరామగిరి గ్రామాలను వరద నీరు చుట్టుముట్టింది. ఇలా మూడు రాష్ట్రాల రాకపోకలు బంద్ అయ్యాయి.