భారీ వర్షాలు..తెలుగు రాష్ట్రాల్లో 86 రైళ్లు రద్దు

Heavy rains..86 trains canceled in Telugu states

హైదరాబాద్‌: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లను భారీ వర్షాలు ముంచెత్తాయి. దీంతో ఎక్కడ చూసిన వాగులు, వంకలు పోటెత్తాయి. వర్షాలు, వరదల కారణంగా దక్షిణ మధ్య రైల్వే (SCR) 86 రైళ్లను రద్దు చేసింది. మరో 70కి పైగా రైళ్లను దారి మళ్లించింది. రద్దయిన రైళ్లలో సూపర్‌ఫాస్ట్‌, ఎక్స్‌ప్రెస్‌లు ఉన్నాయని ఎస్‌సీఆర్‌ వెల్లడించింది. పలు ప్యాసింజర్‌ రైళ్లను కూడా రద్దుచేసినట్లు తెలిపింది. మరికొన్నింటిని పాక్షికంగా రద్దుచేశామని అధికారులు పేర్కొన్నారు.

కాజీపేట-డోర్నకల్-కాజీపేట, డోర్నకల్-విజయవాడ-డోర్నకల్‌, విజయవాడ-గుంటూరు-విజయవాడ రైళ్లను రద్దు చేయగా, ఢిల్లీ-సెంట్రల్ చెన్నై, దానాపూర్-బెంగళూరు రైళ్లను దారి మళ్లించారు. అదేవిధంగా రాయపురం-పటేల్ నగర్, హజ్రత్ నిజాముద్దీన్-రేణిగుంట రైళ్లను మరోమార్గంలో మళ్లించారు.