తెలుగు రాష్ట్రాల సీఎంలు ఏం చర్చిస్తారు.?

రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు , రేవంత్ రెడ్డి లు ఈ నెల 06 న హైదరాబాద్‌లోని మహాత్మాజ్యోతిరావు ఫూలే భవన్‌లో సమావేశం కాబోతున్నారు. గత పదేళ్లుగా రెండు రాష్ట్రాల మధ్య పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించుకుందామని రీసెంట్ గా చంద్రబాబు..రేవంత్ కు లేఖ రాసిన సంగతి తెలిసిందే. అందుకు రేవంత్ రెడ్డి అంగీకారం తెలిపారు. విభజన చట్టంలో ఇరు రాష్ట్రాల మధ్య పెండింగ్‌లో ఉన్న సమస్యల పరిష్కారం కోసం చంద్రబాబు ప్రతిపాదించిన సమావేశానికి తాను అంగీకరిస్తున్నట్లు రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం తరపున చంద్రబాబును తాము సాదరంగా ఆహ్వానిస్తున్నామని అన్నారు.

ఏపీ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో అఖండ విజయం సాధించినందుకు శుభాకాంక్షలు. నాలుగోసారి ముఖ్యమంత్రి అయిన మీరు ఎంతో ప్రత్యేకత చాటుకున్నారు. ఈ టర్మ్‌లో మీరు మరింత మంచి పాలన అందించాలని కోరుకుంటున్నాను. జరగబోయే ముఖాముఖి సమావేశంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులుగా నేను మీ అభిప్రాయాలను గౌరవిస్తాను. విభజన చట్టంలో ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న పెండింగ్ అంశాలు పరిష్కరించుకోవడం చాలా ముఖ్యం. ఇది జరగడం కోసం నేరుగా కూర్చొని మాట్లాడుకుంటనే మంచిది. పరస్ఫరం ఆలోచనలు పంచుకోవడం, సమస్యల పరిష్కారం కోసం ఉత్తమమైన మార్గాలను అన్వేషించాలి’’ అని రేవంత్ రెడ్డి లేఖలో పేర్కొన్నారు.

అయితే ఇరువురు ఏ ఏ అంశాలపై చర్చిస్తారు అనేది ఇప్పుడు ఆసక్తి గా మారింది. ఉమ్మడి రాజధాని చిక్కుముడి కూడా వీడిపోవడంతో షెడ్యూల్ 9, 10లోని సంస్థల పంపకంపై ఇరువురు ముఖ్యమంత్రులు చర్చించే అవకాశం ఉంది. రెండు రాష్ట్రాల మధ్య సమస్యల పరిష్కారానికి కేంద్రం కూడా సానుకూలంగా ఉంది. ఉమ్మడి సంస్ఠలకు చెందిన ఆస్తుల పంపకం, ఉద్యోగుల విభజన తదితర సమస్యలకు ఈ భేటీలోనే పరిష్కారం లభించే అవకాశం ఉంది. రేవంత్‌రెడ్డి సీఎం అయిన వెంటనే ఢిల్లీ(Delhi)లోని ఏపీభవన్‌(Ap Bhavan) సమస్యను ఇట్టే పరిష్కరించారు. దీంతో మిగిలిన సమస్యలకు కూడా పరిష్కారం లభిస్తుందని ఆశిస్తున్నారు. ఉమ్మడి హెచ్‌ఆర్సీ(HRC)లో ఉద్యోగుల విభజనకు సంబంధించి గడవు పూర్తయినందున త్వరితగతిని ఈ విషయం తేల్చాల్స ఉంది. తెలంగాణ కమిషన్‌లో పనిచేస్తున్న ఉన్నతాధికారులు తమ స్వలాభం కోసం ఈ ప్రక్రియ ముందుకు సాగకుండా చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ పని వెంటనే చేపట్టాలని ఏపీలో పనిచేస్తున్న తెలంగాణ ప్రాంత ఉద్యోగులు కోరుతున్నారు.