భారీ వరదలు.. ఏపీలో ఆ జిల్లాలకు నిధులు విడుదల

వరద సహాయ చర్యల కోసం 6 జిల్లాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.67కోట్ల నిధులను విడుదల చేసింది. ఎన్టీఆర్ జిల్లాకు రూ.50కోట్లు, కృష్ణాకు రూ.5కోట్లు, అల్లూరి సీతారామరాజు జిల్లాకు రూ.2కోట్లు, పల్నాడుకు రూ.4కోట్లు, గుంటూరుకు రూ.2కోట్లు, ఏలూరుకు రూ.3కోట్లు, తూ.గో జిల్లాకు రూ.కోటి చొప్పున కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

మరోపక్క ఏపీలో భారీ వర్షాలు..వరదల పైన కేంద్రం స్పందించింది. ఏపీలో వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించాలని సీఎం చంద్రబాబు కోరారు. రాష్ట్రంలో వరద నష్టం అంచనాకు కేంద్ర బృందం పంపాలని..తక్షణ సాయం చేయాలని లేఖ రాసారు. దీని పైన కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పందించారు. తక్షణ సాయం కోసం సిఫారసులు చేసేందుకు హోం శాఖ అదనపు కార్యదర్శి నేతృత్వంలో నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేసారు. నేడు రాష్ట్రంలో ఆ టీం పర్యటించనుంది.