చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా

hearing-on-chandrababus-bail-petition-adjourned-to-oct-19

అమరావతి: స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌పై ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో విచారణ జరిగింది. ఇరు వర్గాల తరఫున వాదనలు విన్న ధర్మాసనం విచారణను ఈనెల 19వ తేదీ(గురువారం)కి వాయిదా వేస్తున్నట్లు ఉన్నత న్యాయస్థానం వెల్లడించింది. మరోవైపు చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై విజయవాడ ఏసీబీ కోర్టులో కూడా విచారణ జరిగింది. చంద్రబాబు తరఫు లాయర్ల పిటిషన్‌పై కౌంటర్‌ దాఖలు చేయాలని సీఐడీకి కోర్టు ఆదేశాలు ఇచ్చింది.