📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్

OCD :OCD అంటే ఏమిటో తెలుసా? దీని ప్రభావం జీవితంపై ఎలా ఉంటున్నదో తెలుసుకుందాం..

Author Icon By Sudha
Updated: June 25, 2025 • 5:10 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

OCD అనేది సాధారణ అలవాటు కాదు. ఇది గమనించాల్సిన, చికిత్స పొందాల్సిన మానసిక ఆరోగ్య సమస్య(A mental health problem). శరీరానికి జ్వరం వచ్చినట్లు మనసుకు కూడా చికిత్స అవసరం (Treatment is required)అవుతుంది. మీరు లేదా మీకు తెలిసినవారు ఈ రకమైన లక్షణాలతో బాధపడితే నిపుణుడిని కలవడం మంచిది. మీరు తరచుగా ఏదైనా చెడు జరుగుతుందని భయపడుతూ ఉంటారా..? తలుపులు లాక్ చేశారా లేదా అని పదే పదే చెక్ చేసుకుంటూ ఉంటారా..? ఇలాంటి లక్షణాలను కేవలం సాధారణ అలవాట్లుగా తీసుకోకూడదు. ఎందుకంటే ఇవి OCD సంకేతాలు కావచ్చు. సాధారణంగా ఎవరైనా చాలా శుభ్రంగా లేదా అత్యంత క్రమశిక్షణతో ఉంటే.. వారిని చూసి వీళ్లకు OCD ఉన్నట్లుంది అని చాలా మంది సరదాగా అంటుంటారు.
మానసిక ఆరోగ్య సమస్య
OCD (Obsessive compulsive disorder) అనేది ఒక మానసిక ఆరోగ్య సమస్య. దీంతో బాధపడేవారు కొన్ని ఆలోచనలను ఆపుకోలేరు. ఆ ఆలోచనలు తీవ్రమైన మానసిక ఒత్తిడికి దారితీసి.. వారిని కొన్ని పనులను పదే పదే చేసేలా చేస్తాయి. ఉదాహరణకు చేతులను పదే పదే కడగడం.. తలుపులు లాక్ చేశారా అని పదిసార్లు తనిఖీ చేసుకోవడం వంటివి. ప్రపంచ ప్రఖ్యాత వైద్య సంస్థల ప్రకారం.. OCD ఉన్నవారు తరచుగా ధూళి, సూక్ష్మక్రిముల భయంతో జీవిస్తారు. వారు ఏ పని చేసినా అది పూర్తయిందని వారికి అనిపించదు. మెదడు అదే పనిని మళ్లీ చేయమని ప్రేరేపిస్తుంది. ఇది మెదడులోని సెరోటోనిన్ అనే రసాయనం సరిగా లేకపోవడం వల్ల జరుగుతుంది.

OCD :OCD అంటే ఏమిటో తెలుసా? దీని ప్రభావం జీవితంపై ఎలా ఉంటున్నదో తెలుసుకుందాం..


అనవసర భయం
ఈ సమస్య స్త్రీ, పురుషులిద్దరికీ వస్తుంది. OCD లక్షణాలు వ్యక్తులను బట్టి వేర్వేరుగా కనిపించవచ్చు.
శుభ్రతపై అధిక ఆందోళన.. దుమ్ము, పురుగులతో మురికి అవుతుందని భయం. అనవసర భయం.. తనే తప్పు చేస్తానేమో.. లేదా ఇతరులకు హాని చేస్తానేమో అన్న భయం. అదుపులో లేని ఆలోచనలు,ముఖ్యంగా ప్రమాదం, మరణం వంటి విషయాలపై నియంత్రణ లేని ఆలోచనలు. రోడ్డు దాటుతున్నప్పుడు ఏదైనా ప్రమాదం జరుగుతుందేమో అన్న భయం. ఇంట్లో నుంచి బయటకు వెళ్లాలన్నా భయంతో ఆగిపోవడం.
ఎలా నియంత్రించుకోవాలి
సమయానికి గుర్తించగలిగితే OCDని సమర్థవంతంగా అదుపు చేయవచ్చు. కొంతవరకు వ్యక్తిగతంగా కొన్ని మార్పులు చేసుకోవచ్చు. మన మెదడులో వచ్చే ప్రతి ఆందోళనను డైరీలో రాసుకోవడం వల్ల స్పష్టత వస్తుంది. దీని వల్ల ఆ ఆలోచనలు మనపై ఎక్కువ ప్రభావం చూపకుండా ఉంటాయి. మనకు వస్తున్న భావాలపై అవగాహన పెంచుకోవాలి. తప్పుడు భయాలను వాస్తవాల ఆధారంగా సరిచూసుకోవాలి.
నేను బాగోలేను అనే భావనకు బదులుగా ఇది నాకు తాత్కాలిక సమస్య అని ఆలోచించడం అవసరం.
మనకు దగ్గరగా ఉన్నవారితో మాట్లాడటం.. వారి మద్దతు పొందడం వల్ల మనస్సు ప్రశాంతంగా ఉంటుంది.
చికిత్స ఎలా ఉంటుంది..?
OCD చికిత్సలో ప్రధానంగా ప్రవర్తనా వైద్య పద్ధతి (CBT), మానసిక కౌన్సిలింగ్ వంటివి వాడతారు. అవసరమైతే తగిన మోతాదులో మందులు కూడా ఇస్తారు. ముఖ్యంగా వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే మందులు వాడాలి.

Read Also:ABC Juice: సకల రోగాల నివారణకు ఈ జ్యూస్ తాగి చుడండి

#BreakTheStigma #MentalHealthMatters #MindNeedsCareToo #OCDAwareness #OCDReality Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.