ఆయన పప్పు కాదు.. ఉన్నత విద్యావంతుడు: శామ్ పిట్రోడా

‘He is no Pappu’: What Sam Pitroda said about Rahul Gandhi in US

డాలస్: శామ్ పిట్రోడా మరోసారి లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై ప్రశంసల జల్లు కురిపించారు. ఆయన పప్పు కాదని, ఉన్నత విద్యావంతుడని వివరించారు. ఈ మేరకు అమెరికాలోని డాలస్ లో జరిగిన ఓ కార్యక్రమంలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ పార్టీ చైర్మన్ శామ్ పిట్రోడా పాల్గొని మాట్లాడారు. రాహుల్ గాంధీ ఉన్నత విద్యావంతుడు, చదువరి, లోతైన ఆలోచనాపరుడని పిట్రోడా చెప్పారు. రాహుల్ ఆలోచనల లోతును ఒక్కోసారి అర్థం చేసుకోలేమని వివరించారు.

ఏ అంశంపైనైనా లోతుగా ఆలోచించే వ్యూహకర్త, రాహుల్ ను అర్థం చేసుకోవడం అంత సులభం కాదన్నారు. అయితే, ఆయనపై బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తోందని, కోట్లు కుమ్మరించి మరీ రాహుల్ ను కించపరుస్తోందని శామ్ పిట్రోడా మండిపడ్డారు. కాగా, రాహుల్ గాంధీ అమెరికాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఆదివారం టెక్సాస్ లోని డాలస్ విమానాశ్రయానికి చేరుకున్న రాహుల్ కు ఎన్ఆర్ఐలు ఘనంగా స్వాగతించారు.