హైకోర్టులో కేసీఆర్‌కు భారీ షాక్..

తెలంగాణలో గత కేసీఆర్ ప్రభుత్వ హాయంలో చోటు చేసుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందాల వ్యవహారం.. రాజకీయంగా దుమారం రేపుతోంది. ఈ క్రమంలో కేసీఆర్ కు చుక్కెదురైంది. విద్యుత్ కొనుగోళ్ల అంశంపై ఏర్పాటు చేసిన జస్టిస్ట్ నరసింహారెడ్డి కమిషన్ ను రద్దుచేయాలని కేసీఆర్ పిటీషన్ దాఖలు చేశారు. విద్యుత్ కమిషన్ ఏకపక్షంగా వ్యవహరిస్తోందంటూ కేసీఆర్ తన పిటీషన్ లో పేర్కొన్నారు.

ఈ పిటీషన్ పై హైకోర్టు విచారణ జరిపింది. ఇటీవల ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపించగా.. కేసీఆర్ తరపున సుప్రీంకోర్టు సీనియర్ కౌన్సిల్ ఆధిత్య వాదనలు వినిపించారు. అడ్వకేట్ జనరల్ వాదనలతో ఏకీభవించిన హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ ఆరాధే కేసీఆర్ పిటీషన్ ను డిస్మిస్ చేశారు. విద్యుత్ కమిషన్ విచారణను కొనసాగించవచ్చు అంటూ పేర్కొన్నారు. ఫలితంగా- విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై విచారణ కొనసాగడం ఖాయమైంది. ఈ కమిషన్ ఇక కార్యాచరణలోకి దిగడానికి గ్రీన్ సిగ్నల్ లభించినట్టయింది.