no 1 hero prabhas

HBD: ఆల్ ఇండియా నెంబర్ వన్ హీరో ప్రభాస్.. ఇంతకంటే ఫ్రూఫా

టాలీవుడ్‌లో ఎంతో మంది హీరోలు ఉన్నప్పటికీ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ నటుల్లో ప్రభాస్‌ ఒకరు మాత్రమే తన ప్రత్యేకమైన శైలితో టాలీవుడ్‌ను కొత్త స్థాయికి తీసుకెళ్లిన ప్రభాస్‌ పేరు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రతిష్ట తెచ్చుకుంది ఈ రోజున ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులు తమ హీరో గురించి పలు ఆసక్తికర విషయాలను సోషల్ మీడియాలో తెగ వైరల్‌ చేస్తూ మరింత పాపులారిటీ పెంచుతున్నారు ప్రభాస్‌ కేవలం ఒక నటుడు మాత్రమే కాదు ఓ నెంబర్ వన్ హీరోగా తనకంటూ ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్నారు ఆయన తన నటన వ్యక్తిత్వం సేవాతత్వంతోనూ అభిమానులను అద్భుతంగా ప్రభావితం చేశారు చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరూ ప్రభాస్ సినిమాలను థియేటర్లలోనే చూడాలని ఉత్సాహంగా ఎదురు చూస్తుంటారు ఆయన తన సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం ఎప్పుడూ చేస్తూనే ఉంటారు.

ఇటీవల కాలంలో ప్రభాస్‌ చారిత్రాత్మక సినిమాల్లో ఎక్కువగా నటిస్తూ బాక్సాఫీస్‌ వద్ద భారీ కలెక్షన్లను రాబడుతున్నారు సలార్ చిత్రంలోని యాక్షన్ సన్నివేశాలు బాహుబలి లో రాజు పాత్రలోని నటన కల్కి లోని విభిన్న పాత్రలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి ప్రభాస్ సాధించిన విజయాలు ఎంతో మంది బాలీవుడ్‌ యాక్టర్లు కూడా కలలు కంటూ సాధించలేని విజయాలు ముఖ్యంగా బాహుబలి 2 మరియు కల్కి చిత్రాలతో రెండు సార్లు రూ.1000 కోట్ల గ్రాస్‌ వసూళ్ళను అందుకున్నాడు ఇది ఒక గొప్ప ఘనత ప్రభాస్ సినిమాలు అంటే నిర్మాతలు దర్శకులు బయ్యర్లు సైతం సినిమాలు కొనడానికి క్యూలో నిలబడుతుంటారు ప్రస్తుతం ది రాజా సాబ్ సలార్ 2 హనురాఘవపూడి దర్శకత్వంలో ఫౌజీ వంటి చిత్రాల్లో నటిస్తున్నారు అంతేకాకుండా అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా తో కూడా ప్రభాస్ ఓ సినిమాకు సైన్ చేశారు.

ప్రభాస్‌ ఎంత పెద్ద స్టార్ అయినప్పటికీ ఆయన తన వినయం సేవాతత్వంతో మరింత గుర్తింపు పొందారు సహజ విపత్తులు జరిగినప్పుడు ప్రభాస్ భారీ విరాళాలు ఇస్తూ తన ప్రజాప్రేమను చాటుకుంటారు తన సొంత ఊరిలో లేదా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏదైనా కార్యక్రమం జరిగినప్పుడు వారికి భోజనాలు సమకూర్చడం తన సినిమా సెట్స్‌లో పని చేసే నటీనటులకు సైతం తన ఇంటి నుండి భోజనం పంపించడం వంటి పనుల ద్వారా అనేకమంది గుండెల్లో స్థానాన్ని సంపాదించారు ప్రభాస్‌ తన సహనంతో సేవాతత్వంతో వ్యక్తిత్వంతో దేశవ్యాప్తంగా వన్ అండ్ ఓన్లీ హీరో గా పేరుపొందారు.

Related Posts
Samantha : నాగ చైతన్య విషయంలో నేను అలా ప్రవర్తించి ఉండాల్సింది..తప్పు చేశా అంటూ సమంత షాకింగ్ కామెంట్స్
samantha

సమంత మరియు నాగ చైతన్య వీరిమధ్య విడాకులు గురించి తరచూ సోషల్ మీడియాలో చర్చలు జరుగుతూనే ఉంటాయి వీరిద్దరి విడాకులకు కారణం ఏమిటి అన్నది ఎంతో మందికి Read more

ఆటోలో తిరుగుతున్న అందాల భామ..
alia bhatt

సెలబ్రిటీల జీవితాలంటే లగ్జరీ కార్లు, ఖరీదైన బట్టలు,భోగభాగ్యాలు అనుకుంటారు.అయితే కొందరు తారలు ఆడంబరాలను పక్కన పెట్టి సాదాసీదా జీవితాన్ని చూపిస్తూ అభిమానులను ఆశ్చర్యపరుస్తుంటారు.ఇటీవలి కాలంలో బాలీవుడ్ అందాల Read more

తొక్కిసలాట దురదృష్టకర ఘటన: అల్లు అర్జున్
allu arjun press meet

సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఒక దురదృష్టకర ప్రమాదమని ప్రముఖ హీరో అల్లు అర్జున్ అన్నారు. ఈ విషాద ఘటనలో కొన్ని కుటుంబాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. Read more

చిన్న చిత్రాలే ఇండస్ట్రీని నడిపిస్తాయి: సుధీర్ బాబు
sudheer

శివ కుమార్ రామచంద్రవరపు నితిన్ ప్రసన్న ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం నరుడి బ్రతుకు నటన త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది ఈ సినిమాను రిషికేశ్వర్ యోగి దర్శకత్వం Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *