హరియాణా, జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మరి కొన్ని గంటల్లో వెలువడనున్నాయి. ఇప్పటికే ఓట్ల లెక్కింపు కోసం అన్ని ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. ఎగ్జిట్ పోల్స్ దాదాపు కాంగ్రెస్ కూటమికే అనుకూలంగా రాగా బీజేపీ మాత్రం గెలుపుపై ధీమాగా ఉంది. దీంతో ఫలితాలపై మరింత ఆసక్తి నెలకొంది.
లోక్‌సభ ఎన్నికల తర్వాత ఈ రెండు చోట్ల బీజేపీ-కాంగ్రెస్ ముఖాముఖి తలపడుతున్నాయి. హర్యానాలో ఫలితాలపై రాజకీయ పార్టీలు, నాయకుల్లో ఉత్కంఠ నెలకొంది. హ్యాట్రిక్ విజయంపై బీజేపీ ధీమా వ్యక్తం చేస్తుండగా… పదేండ్ల తర్వాత అధికారంలోకి వస్తామని కాంగ్రెస్ చెప్తున్నది. మరోవైపు 370 అధికరణ రద్దు తర్వాత తొలిసారి జమ్ము కశ్మీర్‌లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో విజయంపై బీజేపీ, పీడీపీ, కాంగ్రెస్-నేషనల్ కాన్ఫరెన్స్ కూటములు ధీమాగా ఉన్నాయి.