Harish Rao shared a photo of 11 years.

11 ఏళ్ల నాటి ఫొటోను షేర్ చేసిన హరీష్ రావు..!

తెలంగాణ చరిత్ర లో ఫిబ్రవరి 18కి ప్రత్యేకత

హైదరాబాద్‌: తెలంగాణ చరిత్ర లో ఫిబ్రవరి 18కి ప్రత్యేకత ఉన్నది. 2014, ఫిబ్రవరి 18వ తేదీన లోక్ సభ లో తెలంగాణ బిల్లు ఆమోదించబడింది. ఈ సందర్భాన్ని గుర్తుచేసుకుంటూ బీఆర్ఎస్ కీలక నేత, మాజీ మంత్రి హరీష్ రావు సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు. బిల్లు ఆమోదించిన తర్వాత ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో కేసీఆర్ తో సంబురాలు చేసుకుంటున్న ఫొటోను హరీష్ రావు పోస్టు పెట్టారు.

పట్టుదల, నిబద్ధత ఉంటే అసాధ్యాన్ని సుసాధ్యం

కేసీఆర్ దార్శనికత కలిగిన నాయకుడి నాయకత్వంలో ప్రజా ఉద్యమం విజయం సాధించిన రోజు అని పేర్కొన్నారు. రాజ్యాంగ బద్ధంగా జరిగే ప్రజాఉద్యమాలు విజయం సాధిస్తాయని చాటిన సందర్భమని, పట్టుదల, నిబద్ధత ఉంటే అసాధ్యాన్ని సుసాధ్యం చేయవచ్చని నిరూపించిన రోజు అని పేర్కొన్నారు. హరీశ్ రావు షేర్ చేసిన ఫొటోలో మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీశ్ రావు, శ్రీనివాస్ గౌడ్, విఠల్ తదితరులున్నారు.

తెలంగాణ ఏర్పాటుపై స్పష్టమైన ప్రకటన

2009 డిసెంబరు 9వ తేదీన తెలంగాణ ఏర్పాటుకు అనుకూలంగా ఆనాటి యూపీఏ సర్కారు ప్రకటన చేసింది. దీక్ష విరమించండి, మేం తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తామని నాటి కేంద్ర మంత్రి చిదంబరం ఫోన్ చేసి కేసీఆర్‌కు చెప్పారు. అయినా కేసీఆర్ వినలేదు. తెలంగాణ ఏర్పాటుపై స్పష్టమైన ప్రకటన వస్తేనే దీక్ష విరమిస్తానని స్పష్టం చేశారు. అప్పటికే 11 రోజులు అయ్యింది. ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింది. అయినా కేసీఆర్ పట్టు వదల్లేదు. దీక్షను కొనసాగించారు అని సోమవారం రోజు హరీశ్‌రావు గుర్తు చేసుకున్నారు.

Related Posts
Janasena : కాసేపట్లో “జయకేతనం” సభ
"Jayaketanam" meeting soon

Janasena : జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభ కాకినాడ జిల్లా పిఠాపురం మండలంలోని చిత్రాడలో మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ, Read more

GRAP దశ 4 అమలులో విఫలత: సుప్రీం కోర్టు సీరియస్
SCI

సుప్రీం కోర్టు, ఢిల్లీలో వాయు కాలుష్యాన్ని తగ్గించడంలో ప్రభుత్వాల నిర్లక్ష్యాన్ని తీవ్రంగా అభ్యంతరించిందీ. ఢిల్లీలో వాయు కాలుష్యం పెరిగిపోతున్న నేపథ్యంలో, సుప్రీం కోర్టు, "గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ Read more

తెలంగాణలో ప్రారంభమైన ఇంటర్‌ పరీక్షలు
Inter exams begin in Telangana

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్‌ పరీక్షలు మొదలయ్యాయి. పరీక్ష కేంద్రాల వద్ద సందడి వాతావరణం నెలకొంది. ఈరోజు నుంచి ఇంటర్ పరీక్షలు ఉదయం 9 గంటల Read more

మోదీకి బుక్ ను గిఫ్ట్ గా ఇచ్చిన ట్రంప్
మోదీకి బుక్ ను గిఫ్ట్ గా ఇచ్చిన ట్రంప్

ట్రంప్ గిఫ్ట్‌గా ఇచ్చిన పుస్తకం యునైటెడ్ స్టేట్స్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ భారత ప్రధాని నరేంద్ర మోదీకి "Our Journey Together" అనే పుస్తకాన్ని గిఫ్ట్‌గా అందజేశారు. Read more