డిప్యూటీ సీఎం భట్టికి హరీశ్ రావు సవాల్

harish-rao

తెలంగాణ అసెంబ్లీలో ఆర్ధిక మంత్రి భట్టి విక్రమార్క 2024 -25 ఏడాదికి గాను వార్షిక బడ్జెట్ ను ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే. దీనిపై ఈరోజు చర్చ జరుగుతుంది. ఈ క్రమంలో డిప్యూటీ CM భట్టి విక్రమార్కకు మాజీ మంత్రి హరీశ్ రావు సవాలు విసిరారు. ‘కాసేపు అసెంబ్లీ సమావేశాలకు స్పీకర్ బ్రేక్ ఇస్తే నేను, భట్టి గన్ పార్క్ వద్ద నిలబడుతాం. అక్కడ వెళ్లే జనం ఎవరి పాలనలో కరెంట్ బాగుందో వారే చెప్తారు. దీనికి సిద్ధమా?’ అని ప్రశ్నించారు. బిఆర్ఎస్ను లక్ష్యంగా చేసుకున్నట్లుగా బడ్జెట్ ప్రసంగం ఉందన్నారు.

ఇక రాజకీయ కక్షతో కేసీఆర్ తీసుకొచ్చిన పథకాలను నిలిపివేయొద్దని హరీశ్ రావు ప్రభుత్వాన్ని కోరారు. కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్ను కొనసాగించాలన్నారు. అవసరమైతే ఆ పథకాల ముందు కేసీఆర్ పేరును తొలగించాలన్నారు. రాజకీయాల కోసం గర్భిణులను ఇబ్బంది పెట్టొద్దని అన్నారు. రేపటి భవిష్యత్తును దెబ్బతీయొద్దని తెలిపారు. తమ ప్రభుత్వ హయాంలో మాతాశిశు మరణాల రేటును తగ్గించామని గుర్తు చేశారు.