సీఎం రేవంత్ విపత్తును కూడా రాజకీయం చేస్తున్నారు- హరీశ్ రావు

సీఎం రేవంత్ నవ్విపోదురు గాక నాకేంటి సిగ్గు అన్నట్టు వ్యవహరిస్తున్నారని హరీశ్ రావు విమర్శించారు. ‘సీఎం స్థాయిని దిగజార్చి, విపత్తును కూడా రాజకీయం చేయడం దురదృష్టకరం. తాను చీప్ మినిస్టర్ అని మరోసారి నిరూపించుకున్నారు. ప్రతిపక్షాల మీద నిందలు వేస్తూ ప్రభుత్వ వైఫల్యాన్ని ఒప్పుకున్నారు. వరదలతో ప్రజలు అతలాకుతలం అవుతుంటే ఆలస్యంగా మొద్దు నిద్ర లేచి ప్రతిపక్షాల మీద పడి ఏడుస్తున్నారు’ అని ట్వీట్ చేశారు.

ఇదిలా ఉంటె రాష్ట్రవ్యాప్తంగా కుండపోత వర్షాలతో దాదాపు 25 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్టుగా వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. వానలు కొనసాగుతుండటంతో నష్టం పెరిగే అవకాశం ఉన్నదన్న అభిప్రాయపడుతున్నారు. వ్యవసా య శాఖ అధికారుల ప్రాథమిక నివేదికల ప్రకారం దాదాపు 12-15 లక్షల ఎకరాల పత్తి ,10 లక్షల ఎకరాల్లో వరి, 3 లక్షల ఎకరాల్లో మక్కజొన్నతోపాటు ఇతర పంటలు దెబ్బతిన్నట్టుగా అధికారులు లెక్కలు వేస్తున్నారు.