వరదల ఉదృతి ఫై హరీష్ రావు ఎమోషనల్ ట్వీట్

అల్ప పీడనం కారణంగా తెలంగాణ లో నాల్గు రోజులుగా భారీ వర్షాలు పడుతున్న సంగతి తెలిసిందే. ఎక్కడిక్కడే చెరువులు , వాగులు , వంకలు పొంగిపొర్లుతుండడం అనేక చోట్ల రోడ్లు తెగిపోయాయి రవాణా వ్యవస్థ స్థంభించింది. ఇటు రైల్వే ట్రాక్ లు సైతం తెగిపోయాయి. ఇక వేలాది ఎకరాలు నీటమునిగాయి. తమకు సాయం చేయాలనీ రాష్ట్ర ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

ఈ క్రమంలో మాజీ మంత్రి , బిఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు వరదల ఫై ఎమోషనల్ ట్వీట్ చేసారు. ప్రభుత్వం కొంతకాలం శుష్క రాజకీయాలు,కూల్చివేతలను ఆపి బాధితులను ఆదుకోవడం పై సంపూర్ణంగా దృష్టి కేంద్రీకరించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే తక్షణ సహాయ చర్యలు అందలేదని జనం తమ ఆవేదన, ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారని వెల్లడించారు. ప్రభుత్వం బాధ్యతాయుతంగా మనసుపెట్టి చర్యలు తీసుకోవాలని, వరద బాధితులను అన్ని విధాలుగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. విద్యుత్ సరఫరాను పునర్దరించాల్సిన చోట వేగంగా చర్యలు తీసుకోవాలని, ఆహారం నీరు అందుబాటులో ఉంచాలని తెలిపారు. అసలే రాష్ట్రం విష జ్వరాలతో విలువిలలాడుతోందని, వరదల వల్ల మరింత విజృంభించే ప్రమాదం ఉందని దీంతో అన్ని శాఖలు అప్రమత్తం కావాలని సూచించారు. పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలి. ఎకరానికి పదివేల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలి అని హ‌రీశ్‌రావు డిమాండ్ చేశారు.