Happy birthday my love..Obama check for divorce news

విడాకుల వార్తలకు బరాక్ ఒబామా చెక్

న్యూయార్క్‌ : అమెరికా మాజీ ప్రెసిడెంట్ బరాక్ ఒబామా తన భార్య మిషెల్ ఒబామాతో విడాకులు తీసుకుంటున్నారని వస్తోన్న వార్తలకు చెక్ పెట్టారు. ఆమె బర్త్ డే సందర్భంగా స్పెషల్ విషెస్ తెలియజేశారు. ‘హ్యాపీ బర్త్ డే మై లవ్. మీరు నా జీవితంలో హాస్యం, ప్రేమ, దయతో నింపావు. నీతో కలిసి జీవితంలో ఎన్నో సాహసాలు చేయగలిగినందుకు నేను చాలా అదృష్టవంతుడిని. లవ్ యూ’ అని తెలిపారు.

ఇటీవల వీరు విడాకులు తీసుకోబోతున్నారనే వార్తలు వచ్చాయి. జనవరి 17న మిషెల్ ఒబామా పుట్టిన రోజు. భారతీయ కాలమానం ప్రకారం బరాక్ ఒబామా శుక్రవారం రాత్రి 11 గంటలకు భర్యకు బర్త్ డే విషెస్ చేప్పారు. విడాకుల విషయంలో స్వయంగా మిషెల్ టీం ఆమె పుట్టిన రోజునాడే క్లారిటీ ఇచ్చింది.

image

ఒబామా దంపతులు విడాకులు తీసుకోనున్నారనే వార్తల్లో నిజం లేదని స్పష్టం చేసింది. అలాగే డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కూడా ఒబామా హజరవుతారని మిషెల్ ఒబామా టీం తెలిపింది. గతంలో ట్రంప్ ఒబామా కుటుంబాన్ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు, జాతి ఆధారంగా చేసిన విమర్శల వల్లే మిషెల్ ఈ కార్యక్రమానికి దూరంగా ఉంటున్నారని తెలిపింది. ట్రంప్ చేసిన వ్యాఖ్యలను మిషెల్ సీరియస్‌గా తీసుకున్నారని.. ఆయన్ని ఆమె ఎప్పటికీ క్షమించనని చెప్పినట్లు పేర్కొంది.

కొన్నిరోజుల క్రితం అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్‌ అంత్యక్రియలు జరిగినప్పుడు ఆమె వేరే చోట ఉండటం వల్ల ఈ కార్యక్రమానికి రాలేకపోయారని తెలిపింది. గత కొంతకాలంగా ఒబమా, మిషల్ దంపతులు వివిధ కార్యక్రమాలకు విడివిడిగా హాజరవుతున్నారు. దీంతో వీళ్లిద్దరి మధ్య మనస్పర్థలు వచ్చినట్లు ఊహగానాలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే మిషెల్ టీమ్ దీనిపై క్లారిటీ ఇచ్చింది.

Related Posts
ఎవరినీ వదిలిపెట్టాను అంటూ జగన్ వార్నింగ్
jagan fire cbn

తమ పార్టీ నాయకులపై అన్యాయంగా కేసులు అన్యాయంగా వ్యవహరించిన వారిని వదిలిపెట్టేది లేదు ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గన్నవరం Read more

Infosys: టెక్కీలకు ఇన్ఫోసిస్ ప్రొఫెషనల్ జాబ్ అఫర్
టెక్కీలకు ఇన్ఫోసిస్ ప్రొఫెషనల్ జాబ్ అఫర్

ప్రపంచవ్యాప్తంగా టెక్ కంపెనీలలో తొలగింపులు కొనసాగుతుండగా, పలు కంపెనీలు ఈ ఏడాదిలో ఇప్పటివరకు 23 వేల మందిని తొలగించాయి. దీనికి కారణాలు ఆదాయాలు తగ్గడం, పెద్ద ఎత్తున Read more

Komatireddy Venkat Reddy: బీఆర్ఎస్ పై కోమటిరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు
Komatireddy Venkat Reddy: బీఆర్ఎస్‌పై కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి ఇక భవిష్యత్తు లేదని, ఆ పార్టీ మళ్లీ అధికారంలోకి రావడం కేవలం కలగానే మిగిలిపోతుందని మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి సంచలన వ్యాఖ్యలు Read more

వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును నడిపిన మహిళా సిబ్బంది
వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును నడిపిన మహిళా సిబ్బంది

భారతీయ రైల్వే చరిత్రలో ఓ సువర్ణాధ్యాయం లిఖించబడింది. మొట్టమొదటిసారిగా వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును పూర్తిగా మహిళా సిబ్బందితో నడిపి, నారీశక్తి సామర్థ్యాన్ని రైల్వే శాఖ సగర్వంగా Read more