Andhra pradesh: ఆంధ్రాలో హాల్ట్ స్టేషన్లు..

Andhra pradesh: ఆంధ్రాలో హాల్ట్ స్టేషన్లు..

వేసవి సెలవులు ప్రారంభమయ్యే వేళ పుణ్యక్షేత్రాల సందర్శనకు భక్తులు, పర్యాటకులు సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా శ్రీవారి దర్శనం కోసం వెళ్లే భక్తులకు ఇది ఒక మంచి అవకాశం. ఈ క్రమంలో హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్ చెప్పింది దక్షిణ మధ్య రైల్వే. వేసవి సెలవులలో అనేక మంది పుణ్య క్షేత్రాలు, అలాగే టూర్లకు వెళ్తుంటారు.ఈ రద్దీని దృష్టిలో ఉంచుకుని రైల్వే అధికారులు పలు ప్రత్యేక రైళ్లను ప్రవేశపెట్టడం ఆనవాయితీగా వస్తోంది. సికింద్రాబాద్ ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలను నిర్వహిస్తోన్న దక్షిణ మధ్య రైల్వే అధికారులు- పలు ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకుని రానున్నట్లు ఇదివరకే ప్రకటించారు.ఇప్పుడు తాజాగా మరో ప్రత్యేక రైలు సర్వీసును ప్రకటించారు అధికారులు.చర్లపల్లి నుంచి తిరుపతికి ప్రత్యేక రైళ్లను నడిపించనున్నారు. ఈ వేసవి సీజన్ పొడవునా అంటే మే 31వ తేదీ వరకు ఈ రైళ్లు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి. చర్లపల్లి నుంచి తిరుపతికి మొత్తం 16 రైలు సర్వీసులు రాకపోకలు సాగించనున్నాయి. ఈ నెల 11వ తేదీ నుంచి మే 30వ తేదీ వరకు ప్రతి శుక్ర, ఆదివారాలు అంటే- ఏప్రిల్ 13, 18, 20, 25, 27, మే 2, 4, 9, 11, 16,18, 23, 25, 30 తేదీల్లో రాత్రి 9: 35 నిమిషాలకు చర్లపల్లి నుంచి బయలుదేరే నంబర్ 07017 ప్రత్యేక రైలు మరుసటి రోజు ఉదయం 10:10 నిమిషాలకు తిరుపతికి చేరుకుంటుంది.

Advertisements

ప్రత్యేక రైలు

తిరుగు ప్రయాణంలో ఈ నెల 12వ తేదీ నుంచి మే 31వ తేదీ వరకు ప్రతి ఆది, మంగళవారాలు అంటే- 14, 19, 21, 26, 28, మే 3, 5, 10, 12, 17, 19, 24, 26, 31 తేదీల్లో సాయంత్రం 4:40 నిమిషాలకు తిరుపతి నుంచి బయలుదేరే నంబర్ 07018 నంబర్ ప్రత్యేక రైలు మరుసటి రోజు ఉదయం 7: 10 నిమిషాలకు సికింద్రాబాద్‌కు చేరుకుంటుంది.మల్కాజ్‌గిరి, కాచిగూడ, ఊందానగర్, షాద్‌నగర్, జడ్చర్ల, మహబూబ్‌నగర్, వనపర్తి రోడ్, గద్వాల, కర్నూలు సిటీ, డోన్, గుత్తి, తాడిపత్రి, యర్రగుంట్ల, కడప, ఒంటిమిట్ట, రాజంపేట, రేణిగుంట మీదుగా ఈ రైళ్లు రాకపోకలు సాగిస్తాయి.

చర్లపల్లి

సికింద్రాబాద్, హైదరాబాద్, కాచిగూడ రైల్వే స్టేషన్లపై ప్రయాణికుల సంఖ్య పెరుగుతుండటంతో దక్షిణ మధ్య రైల్వే ప్రత్యామ్నాయంగా చర్లపల్లిని కొత్త రైల్వే టర్మినల్‌గా అభివృద్ధి చేసింది. తొమ్మిది ప్లాట్ఫార్మ్‌లు, ఆధునిక వసతులతో ఈ స్టేషన్‌ను తీర్చిదిద్దారు. దాదాపు 450 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ టర్మినల్ ఇప్పటికే పలు రెగ్యులర్, స్పెషల్ రైళ్లకు హబ్‌గా మారింది.ఈ నేపథ్యంలో చర్లపల్లి నుంచి తిరుపతికి ప్రత్యేక రైళ్లు ప్రకటించటంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Read Also: Hyderabad: శ్రీవారి భక్తులకు శుభవార్త! హైదరాబాద్ నుంచి ప్రత్యేక రైళ్ల సౌకర్యం

Related Posts
వక్స్ బిల్లుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం
Union Cabinet2

JPC (జాయింట్ పార్లమెంటరీ కమిటీ) రిపోర్టు ఆధారంగా సవరించిన వక్స్ బిల్లును కేంద్ర క్యాబినెట్ తాజాగా ఆమోదించింది. మార్చి 10నుంచి ప్రారంభమయ్యే పార్లమెంటు బడ్జెట్ సమావేశాల రెండో Read more

Indians : యూఏఈ క్షమాభిక్ష వెనుక ఉద్దేశం ఏముంది ?
Indians యూఏఈ క్షమాభిక్ష వెనుక ఉద్దేశం ఏముంది

Indians : యూఏఈ క్షమాభిక్ష వెనుక ఉద్దేశం ఏముంది ? పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ Read more

Indus Waters Treaty : సింధు జలాల ఒప్పందం రద్దు.. పాక్కు తేల్చిచెప్పిన భారత్
Indus Waters Treaty

పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ పాకిస్థాన్‌తో ఉన్న సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్లు అధికారికంగా ప్రకటించింది. 1960లో ఇరు దేశాల మధ్య జరిగిన ఈ Read more

TTD : తిరుమలలో శాస్త్రోక్తంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
తిరుమలలో శాస్త్రోక్తంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం

TTD : తిరుమల శ్రీవారి ఆలయంలో తెలుగు నూతన సంవత్సర ఉగాదిని పురస్కరించుకొని కోయిల్ ఆళ్వార్ తిరుమంజనంను టీటీడీ అధికారులు ఘనంగా నిర్వహించారు. కోయిల్ ఆళ్వార్ తిరుమంజనంను Read more

Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×