Gurukula staff met Deputy Chief Minister Pawan Kalyan

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ని కలిసిన గురుకుల సిబ్బంది

అమరావతి : ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ గురుకులాల్లో విధులు నిర్వహిస్తున్న ఔట్ సోర్సింగ్ ఉపాధ్యాయులు, గెస్ట్ లెక్చరర్లు మంగళవారం మంగళగిరిలోని క్యాంపు కార్యాలయం వద్ద రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ని కలిసి తమ సమస్యలు చెప్పుకొన్నారు. గత 15 సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్న తమను కాంట్రాక్టు లెక్చరర్లుగా మార్పు చేసి 2022 పీఆర్సీ ప్రకారం జీతాలు చెల్లించాలని కోరారు. శాంక్షన్డ్ పోస్టుల్లోనే తాము సంవత్సరాల తరబడి పని చేస్తున్నామని, అతి తక్కువ జీతాలతో ఇస్తూ తమ శ్రమను దోచుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్య పట్ల పవన్ కళ్యాణ్ సానుకూలంగా స్పందించారు. పూర్తి పరిశీలన నిమిత్తం సంఘం నాయకులను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా పిలిచి మాట్లాడారు.

Related Posts
ఐపీఎల్ 2025లో ధోని ఆడనున్నాడా
ఐపీఎల్ 2025లో ధోని ఆడనున్నాడా

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ మరోసారి తన అభిమానులను ఆశ్చర్యపరచడానికి సిద్ధమయ్యాడు.43 ఏళ్ల వయసులో కూడా ధోనీ ఐపీఎల్ 2025 సీజన్ కోసం బ్యాటింగ్ Read more

ప్రియాంకా చోప్రానే నాకు రోల్ మోడల్ అంటున్న సమంత
sam priyanka

నటి సమంత రూత్ ప్రభు, ప్రియాంకా చోప్రాను తన రోల్ మోడల్‌గా భావిస్తున్నట్టు ప్రకటించారు. 'బిజినెస్ టుడే' నిర్వహించిన 'మోస్ట్ పవర్ఫుల్ వుమెన్' కార్యక్రమంలో మాట్లాడిన సమంత, Read more

మీర్‌పేట్ మాధవి మర్డర్ కేసులో ట్విస్ట్
Meerpet Madhavi Murder Case

హైదరాబాద్ మీర్‌పేట వెంకటమాధవి హత్య కేసు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనంగా మారింది. సంక్రాంతి రోజు తన భార్య మాధవిని రిటైర్డ్ జవాన్ గురుమార్తి దారుణంగా హత్య Read more

మంత్రి పొంగులేటిపై కవిత ఫైర్
kavitha ponguleti

తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతిపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రవర్తన పెద్ద దుమారాన్నే రేపింది. ఈ ఘటనపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *