Guntur City Mayor resigns!

Guntur: గుంటూరు నగర మేయర్ రాజీనామా!

Guntur: గుంటూరు నగర మేయర్ పదవికి కావటి మనోహర్ నాయుడు రాజీనామా చేశారు. నగరకమిషనర్‌ తీరుకు నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు మీడియాకు వెల్లడించారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని ప్రతిపక్ష నాయకులు ప్రజలు ఇచ్చిన పదవుల్లో ఉండలేని పరిస్థితి నెలకొందని ఆరోపించారు. 2021లో మనోహర్ నాయిడు గుంటూరు మేయర్‌గా ఎన్నికయ్యారు.

Advertisements
గుంటూరు నగర మేయర్ రాజీనామా!

గుంటూరు జిల్లా రాజకీయాల్లో కలకలం

మనోహర్ పదవీ కాలం మరో ఏడాది ఉంది. ఇంతలోనే రాజీనామా చేయడం గుంటూరు జిల్లా రాజకీయాల్లో కలకలం రేగింది. ఆయనకు కొంతకాలంగా నగర కమిషనర్‌ పులి శ్రీనివాసులతో పొసగడం లేదు. ఇద్దరి మధ్య వివాదాలు నడుస్తున్నాయి. ఫిబ్రవరిలో జరిగిన గుంటూరు నగర పాలక సంస్థ స్టాండింగ్‌ కమిటీ ఎన్నికల్లో అనూహ్య పరిణామాలు జరిగాయి. ఎక్కువ కూటమి సభ్యులు విజయం సాధించారు. దీనికి తోడు కొందరు వైసీపీ కార్పొరేటర్లు కూడా కూటమి పార్టీల్లో చేరారు.

జగన్‌తోనే నడుస్తానని

ఇలా గుంటూరు రాజకీయాలు మారుతున్న టైంలో సోమవారం స్టాండింగ్ కమిటీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో మనోహర్‌పై అవిశ్వాసం పెట్టబోతున్నారని టాక్ నడుస్తోంది. ఈ చర్చ నడుస్తున్న టైంలో మనోహర్‌ రాజీనామా చేశారు. రాజీనామా తర్వాత మనోహర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తనను ఎన్ని కేసులు పెట్టి ఇబ్బంది పెట్టినా తాను మాత్రం పార్టీ మారే ప్రసక్తి లేదన్నారు. జగన్‌తోనే నడుస్తానని ప్రకటించారు. ఎప్పటికీ వైసీపీలో ఉంటానని స్పష్టం చేశారు. ఇప్పటికే చాలా అవమానాలు, నిందలు ఎదుర్కొని నిలబడ్డానని ఇకపై నిలబడలేకే పదవి నుంచి తప్పుకుంటున్నట్టు వెల్లడించారు.

Related Posts
Sharmila: వైద్య సేవలపై కూటమికి షర్మిల వార్నింగ్
వైద్య సేవలపై కూటమికి షర్మిల వార్నింగ్

ఆంధ్రప్రదేశ్‌లో ఆరోగ్య సేవలపై మరోసారి తీవ్రమైన చర్చలు మొదలయ్యాయి. ఎన్టీఆర్‌ వైద్య సేవలు ఇవాళ్టి నుంచి రాష్ట్రంలోని నెట్‌వర్క్‌ ఆసుపత్రుల్లో నిలిచిపోవడంతో ప్రజల్లో తీవ్ర ఆందోళన మొదలైంది. Read more

గ్లోబల్ ఆర్థిక సంక్షోభంలో రూపీ ₹84.40 వద్ద చరిత్రాత్మక కనిష్ట స్థాయికి చేరింది
rupee

ఇటీవల భారత్‌లో రూపాయి విలువ అమెరికన్ డాలర్‌తో పోలిస్తే గణనీయంగా పడిపోయింది. రూపాయి 84.40 అనే ఆల్-టైమ్ లోవ్ స్థాయికి చేరుకోవడం షాక్ ఇచ్చింది. ఫారెక్స్ వ్యాపారులు Read more

గాజా-ఇజ్రాయెల్ చర్చల మధ్య 70 మరణాలు
గాజా ఇజ్రాయెల్ చర్చల మధ్య 70 మరణాలు

గాజాలో ఇజ్రాయెల్ సైనిక దాడులు కారణంగా శనివారం 70 మంది మరణించినట్లు పాలస్తీనా వైద్యులు తెలిపారు. ఈ కాల్పులు, 15 నెలల యుద్ధాన్ని ముగించేందుకు మధ్యవర్తులు విరమణ Read more

కేటీఆర్ అమరణ నిరాహార దీక్ష..ఎంపీ చామల కౌంటర్
KTR hunger strike to death..MP Chamala counters

హైదరాబాద్‌: స్పీకర్‌పై చేసిన వ్యాఖ్యలను తప్పుపడుతూ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డిని సస్పెండ్‌ చేశారని కాంగ్రెస్‌ ఎంపీ చామల కిరణ్‌కుమార్‌ రెడ్డి అన్నారు. కేటీఆర్‌కు దళితులపై Read more

Advertisements
×