rocket manufacturing in Tel

తెలంగాణలో రాకెట్ తయారీకి గ్రీన్ సిగ్నల్

తెలంగాణలో ప్రైవేట్ రంగంలో రాకెట్ తయారీకి గ్రీన్ సిగ్నల్ లభించింది. హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ సంస్థ స్కైరూట్ ఏరోస్పేస్, రాకెట్ తయారీ, ఇంటిగ్రేషన్, మరియు టెస్టింగ్ యూనిట్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం ద్వారా తెలంగాణ రాష్ట్రం, అంతరిక్ష రంగంలో ప్రత్యేక గుర్తింపును సాధించబోతోందని నిపుణులు భావిస్తున్నారు.

దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో సీఎం రేవంత్ రెడ్డి, స్కైరూట్ కంపెనీ ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. తెలంగాణను ప్రైవేట్ అంతరిక్ష కార్యకలాపాల కేంద్రంగా అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని వెల్లడించారు. స్కైరూట్ సంస్థ ఆధునిక సాంకేతికతను వినియోగిస్తూ, ప్రపంచ స్థాయిలో ఉత్తమ రాకెట్ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయబోతోందని తెలిపారు.

హైదరాబాద్‌ను సాంకేతికత మరియు పరిశోధన రంగంలో ముఖ్య కేంద్రముగా అభివృద్ధి చేయడంలో స్కైరూట్ ఏరోస్పేస్ కీలకపాత్ర పోషించనుంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా రాష్ట్రానికి మెరుగైన పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు వస్తాయని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేస్తోంది. స్కైరూట్ కంపెనీ ఇప్పటికే భారతదేశం తొలి ప్రైవేట్ రాకెట్ “విక్రమ్-ఎస్” విజయవంతంగా నింగిలోకి పంపి ప్రతిభను చాటింది. ఈ నూతన యూనిట్ ద్వారా ఆ సంస్థ మరింత ఆధునిక రాకెట్లను తయారు చేయనుంది. రాకెట్ తయారీ, పరీక్షల ప్రక్రియలన్నీ తెలంగాణలోనే జరగడం గర్వకారణమని సీయం రేవంత్ అన్నారు.

తెలంగాణ రాష్ట్రం ఇటు ఐటీ రంగం, అటు అంతరిక్ష పరిశోధనలో దూసుకుపోతున్న తరుణంలో, స్కైరూట్ సంస్థతో ప్రభుత్వ భాగస్వామ్యం రాష్ట్ర భవిష్యత్ అభివృద్ధికి మార్గదర్శకమవుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Related Posts
ఢిల్లీలో ప్రశాంతంగా కొనసాగుతున్న ఎన్నికలు
delhi

ఢిల్లీలో శాసనసభ ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు పోలింగ్‌ ప్రారంభమవ్వగా.. సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్‌ జరగనుంది. దాదాపు 1.56 కోట్ల Read more

న్యూయార్క్‌లో యుఎఫ్‌సీ పోరాటం: ట్రంప్, టీమ్ DOGE సందర్శన
Donald Trump 6

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరియు ఆయన టీమ్ DOGE ఇటీవల న్యూయార్క్ సిటీకి వెళ్లారు. వారు మేడిసన్ స్క్వేర్ గార్డెన్‌లో జరిగిన యుఎఫ్‌సీ(అల్టిమేట్ ఫైటింగ్ Read more

ఫిబ్రవరి చివర్లో భారీ బహిరంగ సభ: కేసీఆర్
kcr

బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు.. కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఏ ఒక్క సంక్షేమ పథకాల హామీ రాష్ట్రంలో Read more

పెన్షన్ల పంపిణీపై సీఎం కీలక ఆదేశాలు
ap pensions

ఆంధ్రప్రదేశ్‌లో పెన్షన్ పంపిణీ విధానంపై ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఉదయం 5 గంటలకే పెన్షన్ పంపిణీ ప్రారంభించాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *