Grant anticipatory bail.Ram Gopal Varma in High Court

ముందస్తు బెయిల్‌ ఇవ్వండి..హైకోర్టులో ఆర్జీవీ

అమరావతి: వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ మరోసారి ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఇప్పటికే క్వాష్‌ పిటిషన్‌ విషయంలో ఆర్జీవీకి హైకోర్టులో చుక్కెదురైన విషయం తెలిసిందే. దీంతో ఆయన ఇప్పుడు ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.. ఒంగోలు పోలీసులు నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఇక రాజకీయ దురుద్దేశంతోనే తనపై కేసు నమోదు చేశారని పిటిషన్ లో వర్మ పేర్కొన్నారు. ఎవరి పరువుకూ భంగం కలిగించేలా తాను పోస్టులు పెట్టలేదని… వర్గాల మధ్య శత్రుత్వం పెంచేలా పోస్టులు పెట్టలేదని తెలిపారు. తనను అరెస్ట్ చేసి, తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించే అవకాశం ఉందని పిటిషన్ లో పేర్కొన్నారు. తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరారు.

ఇకపోతే.. పోలీసుల నోటీసుల ప్రకారం.. ఈ నెల 19వ తేదీన మంగళవారం రోజు వర్మ పోలీసు విచారణకు హాజరుకావాల్సి ఉన్నా.. ఆ రోజు ఉదయమే ఈ రోజు విచారణకు రాలేను.. మరికొంత సమయం కావాలంటూ సంబంధిత పోలీసులకు వాట్సాప్‌ మెసేజ్‌ పెట్టారు. ఇక ఆ తర్వాత.. ఆర్జీవీ తరపున పోలీస్ స్టేషన్‌కు వచ్చిన న్యాయవాదులు.. సినిమా షూటింగ్‌ కారణంగా ఆర్జీవీ ఈ రోజు విచారణకు హాజరుకాలేకపోయారని.. కొంత సమయం ఇవ్వాలని కోరారు. మొత్తంగా పోలీస్ విచారణకు హాజరుకాని వర్మ.. ఇప్పుడు ముందుస్తు బెయిల్‌ పిటిషన్‌ కోసం హైకోర్టును ఆశ్రయించడం చర్చనీయాంశంగా మారింది.ఇక ఈ బెయిల్‌ పిటిషన్‌పై రేపు (గురువారం) హైకోర్టులో విచారణ జరిగే అవకాశం ఉంది.

Related Posts
ప్రపంచ పిల్లల దినోత్సవం – 20 నవంబర్
World Childrens Day

ప్రపంచ పిల్లల దినోత్సవం ప్రతి సంవత్సరం నవంబర్ 20న జరుపుకుంటారు. ఈ దినోత్సవాన్ని 1954లో ప్రపంచంలో ప్రతి దేశంలో పిల్లల హక్కులు, వారి సంక్షేమం మరియు మంచి Read more

కేరళకు చేరుకున్న పవన్ కళ్యాణ్
కేరళకు చేరుకున్న పవన్ కళ్యాణ్

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన దక్షిణాది పర్యటనను ప్రారంభించారు. హైదరాబాద్ బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి బయలుదేరి, కొచ్చి విమానాశ్రయానికి చేరుకున్న ఆయన, దక్షిణ భారతంలోని Read more

బీసీకి డిప్యూటీ సీఎం పదవి.. సీఎం రేవంత్ కీలక ఆలోచన?
1488570 cm revanth reddy

తెలంగాణ రాజకీయాల్లో బీసీల ప్రాధాన్యత పెరుగుతున్న తరుణంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. రాష్ట్ర కేబినెట్ విస్తరణలో బీసీలకు పెద్దపీట వేయాలని భావిస్తున్న Read more

‘OG’ కోసం నేనూ వెయిటింగ్ – చరణ్
i am also waiting

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న 'OG' చిత్రంపై మెగా హీరో రామ్ చరణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమా కోసం తాను కూడా ఎంతో Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *