Govt Job: ప్రభుత్వ ఉద్యోగి వరుడి కోసం రోడ్డెక్కిన యువతీ.. వైరల్ వీడియో!

Govt Job: ప్రభుత్వ ఉద్యోగి వరుడి కోసం రోడ్డెక్కిన యువతీ..వీడియో వైరల్

ప్రస్తుత కాలంలో ప్రభుత్వ ఉద్యోగానికి ఉన్న క్రేజ్ అమితంగా పెరిగిపోతోంది. ఉద్యోగం లభించాలంటే పోటీ తారాస్థాయికి చేరిన ఈ రోజుల్లో, ప్రభుత్వ ఉద్యోగం అంటే ఒక రకమైన భద్రత, జీవితంలో స్థిరపడిన అనుభూతి కలిగిస్తుంది. ముఖ్యంగా పెళ్లిళ్ల విషయంలో ప్రభుత్వ ఉద్యోగం కలిగిన అబ్బాయిలకు ఎక్కువ డిమాండ్ ఉండటమే కాక, వారి తల్లిదండ్రులు సైతం ఈ ఉద్యోగం ఉన్నవారిని చూసేలా చూడటం మనం తరచుగా చూస్తూనే ఉంటాం.

Advertisements
1 aezoPKIoDgjJLpTmmKaFlw

ప్రభుత్వ ఉద్యోగానికి ఉన్న ప్రత్యేకతలు

ప్రభుత్వ ఉద్యోగం సాధించిన వారి జీవితానికి స్థిరత్వం వస్తుందని చాలా మంది నమ్ముతారు. దానికి ప్రధాన కారణాలు: నిరంతర ఆదాయం- ప్రతి నెలా క్రమం తప్పకుండా జీతం లభించడంతో ఆర్థిక పరమైన భద్రత ఉంటుంది. పదవీ భద్రత- ప్రైవేట్ ఉద్యోగాల్లో పనితీరు ఆధారంగా ఉద్యోగం ఊహించని విధంగా కోల్పోయే ప్రమాదం ఉంటే, ప్రభుత్వ ఉద్యోగాల్లో అలాంటి భయం ఉండదు. అనేక ప్రయోజనాలు- పదవి పెరుగుదల , వార్షిక వేతన పెంపు, పింఛన్, ఇతర భద్రతా పథకాలు లభిస్తాయి. సమాజంలో గౌరవం- ప్రభుత్వ ఉద్యోగం అనేది కుటుంబానికి గౌరవాన్ని తీసుకువస్తుందని పెద్దల అభిప్రాయం. పనిభారం తక్కువ- ప్రైవేట్ కంపెనీలతో పోలిస్తే, ప్రభుత్వ ఉద్యోగాల్లో పని ఒత్తిడి తక్కువగా ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగం అంటే ఇప్పటికీ దేశంలోని చాలా కుటుంబాల్లో అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. ప్రత్యేకంగా వివాహ సంబంధాల్లో ఇది మరింతగా కనిపిస్తుంది. ఒక ప్రభుత్వ ఉద్యోగం ఉన్న వ్యక్తికి ఎక్కువ మంది సంబంధాలు వస్తాయని చాలా మంది నమ్మకం. ముఖ్యంగా, పెళ్లి కూతురి తల్లిదండ్రులు తమ కూతురిని ప్రభుత్వ ఉద్యోగం ఉన్న వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేయాలని కోరుకుంటారు. నేటి తరం యువతకు ఉద్యోగం, కెరీర్ పై స్పష్టమైన అవగాహన ఉన్నా, ప్రభుత్వ ఉద్యోగం అంటే లైఫ్‌ సెటిల్ అయినట్టేనని భావిస్తారు.

    వైరల్ అయిన ఫ్రాంక్ వీడియో

    సోషల్ మీడియాలో ఓ యువతి చేసిన ఫ్రాంక్ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. పెళ్లికూతురిలా ముస్తాబై చేతిలో ప్లకార్డు పట్టుకుని, ‘‘ప్రభుత్వ ఉద్యోగం ఉన్న పెళ్లికొడుకు కోసం చూస్తున్నా’’ అంటూ రోడ్డుపై నిలబడటం, ఆ తర్వాత ప్రభుత్వ ఉద్యోగం ఉన్నవారిని వెతుకుతుంటే, కొందరు సమాధానం ఇవ్వగా మరికొందరు నవ్వుతూ వెళ్లిపోయారు. చివరికి ఓ వ్యక్తి తాను ప్రభుత్వ ఉద్యోగిలో చెప్పిన వెంటనే ఆ యువతి సిగ్గుపడుతూ పెళ్లికి ఒప్పుకోవటం హాస్యాస్పదంగా మారింది. ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు స్పందిస్తూ, ఇది నిజజీవితంలోనూ జరుగుతూనే ఉంది! అని కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు ప్రభుత్వ ఉద్యోగానికి ఉన్న డిమాండ్ పై సెటైర్ గానే కనిపించినా, వాస్తవానికి దగ్గరగానే ఉంది అంటూ చర్చిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగాలకు ఉన్న డిమాండ్ ఇంకా తగ్గలేదని ఈ వైరల్ వీడియోతోనే అర్థం అవుతుంది. ఇది కొంతమంది యువతికి ఉద్యోగంపై ఉన్న స్థిరమైన అభిప్రాయాన్ని, వారి కుటుంబ సభ్యుల ఆశలను ప్రతిబింబిస్తోంది. నేటి యువత పోటీ పరీక్షల కోసం ఎంత శ్రమ పడుతున్నారో, ఉద్యోగానికి దొరకడం ఎంత పెద్ద విషయం అనేది ఈ ట్రెండ్ లో స్పష్టంగా కనిపిస్తోంది.

    Related Posts
    Virat Kohli :మైదానంలోని తన వ్యక్తిత్వంపై ఆసక్తికరమైన కామెంట్స్ చేసిన విరాట్ కోహ్లీ
    Virat Kohli :మైదానంలోని తన వ్యక్తిత్వంపై ఆసక్తికరమైన కామెంట్స్ చేసిన విరాట్ కోహ్లీ

    భారత క్రికెట్ స్టార్ విరాట్ కోహ్లీ తన మైదానంలోని వ్యక్తిత్వంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతంలో తన అగ్రెసివ్ స్వభావాన్ని విమర్శించినవారు, ఇప్పుడు తన ప్రశాంతతను సమస్యగా Read more

    Supreme Court: తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు షాక్
    తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు షాక్

    హైదరాబాద్‌లోని కంచె గచ్చిబౌలి భూముల వివాదం తాజాగా దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. ఈ భూమి వివాదం నేపథ్యంలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. హైదరాబాద్ Read more

    నేడు తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం
    Special meeting of Telangana Assembly today

    హైదరాబాద్‌: ఈరోజు (మంగళవారం) ఉదయం 10 గంటలకు క్యాబినెట్ సమావేశం జరుగుతుంది. అందులో.. కులగణన సర్వే రిపోర్టును ఆమోదిస్తారు. అలాగే.. ఎస్సీ ఉప కులాల వర్గీకరణపై డాక్టర్ Read more

    శ్రీవారి అన్నప్రసాద మెనూలో మార్పులు..
    Changes in Srivari Annaprasadam menu

    తిరుమల: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమలలో కొలువైన శ్రీ వేంకటేశ్వర స్వామిని నిత్యం లక్షల మంది భక్తులు దర్శించుకుంటారు. ఈసందర్భంగా శ్రీవారి సన్నిధిలో ఉండే భక్తులకు అడుగడుగునా Read more

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    ×