రాజమండ్రి సెంట్రల్ జైలుకు గోరంట్ల మాధవ్ తరలింపు

Gorantla Madhav: రాజమండ్రి సెంట్రల్ జైలుకు గోరంట్ల మాధవ్ 

వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ పట్ల గుంటూరు జిల్లాలో చోటుచేసుకున్న పరిణామాలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపుతున్నాయి. ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్‌పై జరిగిన దాడి ఘటనలో ఆయనపై కేసు నమోదు కాగా, మాధవ్ తో పాటు మరో ఐదుగురికి గుంటూరు కోర్టు న్యాయమూర్తి రిమాండ్ విధించడంతో వీరందరినీ రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. అయితే గోరంట్ల మాధవ్ అరెస్టు నుంచి రిమాండ్ వరకూ వరుస ట్విస్టులు చోటు చేసుకున్నాయి.

Advertisements

అనుచిత వ్యాఖ్యలతో వివాదం

ఈ వివాదం వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతిపై ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ చేసిన వ్యాఖ్యలతో మొదలైంది. సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలపై కేసు నమోదైన అనంతరం పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. కానీ ఆ సమయంలో గోరంట్ల మాధవ్, తన అనుచరులతో కలిసి అడ్డగించిన ఘటన ఈ వివాదాన్ని మరింత మలుపు తిప్పింది.

కేసు నమోదు

చేబ్రోలు కిరణ్‌ను తీసుకెళ్తున్న సమయంలో మాధవ్ నేతృత్వంలో జరిగిన దాడి ప్రయత్నంపై పోలీసులు సీరియస్‌ అయ్యారు. అనంతరం గోరంట్ల మాధవ్‌తో పాటు మరో ఐదుగురిపై కేసు నమోదు చేశారు. ఇది పూర్తిగా రాజకీయంగా మారిపోయింది. ఒక మాజీ ఎంపీగా ఉన్న వ్యక్తి పోలీసుల ఎదుట దాడికి యత్నించాడన్న ఆరోపణలు తీవ్ర స్థాయిలో చర్చనీయాంశమయ్యాయి. గోరంట్ల మాధవ్‌ను అరెస్టు చేసిన తర్వాత, పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టే యత్నం చేశారు. అయితే మాధవ్ దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ, “నాకు ఇంకా మాజీ ఎంపీగా హోదా ఉంది, మామూలు నేరస్థులా మీడియా ముందు ఎలా చూపుతారు?” అంటూ వాగ్వాదానికి దిగారు. చివరికి మీడియా ముందు కాకుండా, వైద్య పరీక్షల అనంతరం నేరుగా కోర్టుకు తరలించారు.

రాజమండ్రి సెంట్రల్ జైలుకు మాధవ్

గుంటూరు కోర్టులో గోరంట్ల మాధవ్ చేబ్రోలు మాధవ్ పై దాడి చేసిన కేసులో పోలీసులు రిమాండ్ కోరారు. దీంతో గుంటూరు కోర్టు న్యాయమూర్తి రెండు వారాల రిమాండ్ విధించారు. అయితే రిమాండ్ పై గోరంట్ల మాధవ్ తో పాటు మరో ఐదుగురిని నెల్లూరు కోర్టుకు తరలించాలని ఆదేశించారు. కానీ అక్కడ ఏర్పాట్లు సరిగా లేవని, అక్కడకు పంపితే ఇబ్బందులు తలెత్తుతాయని పోలీసులు జడ్జి దృష్టికి తెచ్చారు. దీంతో న్యాయమూర్తి నెల్లూరు జైలుకు కాకుండా రాజమండ్రి సెంట్రల్ జైలుకు వీరిని తరలించాలని ఆదేశాలు ఇచ్చారు. ఈ నేపథ్యంలో వీరిని అర్ధరాత్రి రాజమండ్రి జైలుకు తరలించారు.

Read also: AP Inter Results : నేడే ఏపీ ఇంటర్‌ ఫలితాలు విడుదల

Related Posts
పిఎల్‌ఐ పథకం కింద మెరిల్ వారి అధునాతన తయారీ ప్రాంగణాన్ని ప్రారంభించిన ప్రధాని
Merrill was the pm modi who launched their advanced manufacturing facility under the PLI scheme

గుజరాత్ : భారతదేశంలో అగ్రగామి గ్లోబల్ మెడ్‌టెక్ కంపెనీల్లో ఒకటైన మెరిల్ తమ అత్యాధునిక ఉత్పత్తి ప్రాంగణాలను గౌరవనీయ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ ఉత్పత్తి Read more

సీఎంఆర్ చెల్లింపుల గడువు పెంచిన తెలంగాణ ప్రభుత్వం
11

హైదరాబాద్‌: సీఎం రేవంత్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని రైస్ మిల్లులు ప్రభుత్వానికి చెల్లించే సీఎంఆర్‌ బకాయిల గడువు తేదీని మరో 3 నెలల Read more

ఏపీ వార్షిక బడ్జెట్‌కు క్యాబినెట్‌ ఆమోదం
Cabinet approves AP Annual Budget

మొత్తం రూ.3.20 లక్షల కోట్లతో వార్షి బడ్జెట్‌‌ అమరావతి: 2025-26 వార్షిక బడ్జెట్‌ కు సంబంధించి సీఎం చంద్రబాబు అధ్యక్షత జరిగిన కేబినెట్ సమావేశం కాసేపటి క్రితం Read more

పోలీసుల విచారణకు హాజరైన రాంగోపాల్‌ వర్మ..
Ram Gopal Varma attended the police investigation

ఒంగోలు : ఫొటోల మార్ఫింగ్ కేసులో ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ పోలీసుల విచార‌ణ‌కు హాజ‌ర‌య్యారు. ఈ మేరకు ఆయన్ను ఒంగోలు రూరల్‌ పోలీస్‌స్టేషన్‌లో సీఐ శ్రీకాంత్‌బాబు Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×